కన్నులపండువగా 50 జంటలతో నిర్వహణ
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు:
పటాన్చెరు పట్టణం శాంతినగర్ కాలనీ పరిధిలో ఉన్న శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు . ఆలయ అధ్యక్షుడు నర్ర బిక్షపతి, గౌరవ అధ్యక్షుడు రమా సంజీవరెడ్డిల నేతృత్వంలో నిర్వహించిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో దాదాపు 50 మంది దంపతులు ఒకే వేదికపై భక్తిశ్రద్ధలతో వ్రతాన్ని ఆచరించారు.. పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న ముఖ్య అతిథులు స్వామివారిని దర్శించుకుని, తీర్థప్రసాదాలు స్వీకరించారు. నందిగామ శంకరప్ప సుమారు 500 ల మందికి అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఆలయ అధ్యక్షుడు నర్ర బిక్షపతి మాట్లాడుతూఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో శాంతి, సౌభాగ్యాలను పెంపొందిస్తాయని, ఇలాంటి సామూహిక వ్రతాలు నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. భక్తులందరికీ శ్రీ సత్యనారాయణ స్వామి, అయ్యప్ప స్వామివార్ల ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు.ఆలయాభివృద్ధికి మరియు భక్తుల సౌకర్యార్థం మున్ముందు కూడా ఇటువంటి అనేక భక్తి కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గురు స్వామి అయ్యప్ప బ్యాటరీ శంకర్, సుధాకర్ స్వామి,నవాజ్ రెడ్డి, అంజి స్వామి, రామస్వామి, చందు స్వామి,నర్ర వీరేశం, నర్ర శైలజ బిక్షపతి, రమా సంజీవరెడ్డి, నాగరాణి, కవిత, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, మహిళలు,భక్తులు తదితరులు పాల్గొన్నారు.

