Telangana

ఎమ్మెల్యే జిఎంఆర్ ఆధ్వర్యంలో సామూహిక వివాహాలు

_వివాహ వేదిక: జిఎంఆర్ ఫంక్షన్ హాల్

_వివాహాల తేదీ: మే 7, 2023

_నిరుపేదలు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి..

_త్వరలోనే ముస్లిం, క్రిస్టియన్ల సామూహిక వివాహాలు

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

దాతృత్వానికి, మంచితనానికి మారుపేరుగా నిలిచిన పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి మరో చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు.పటాన్చెరు నియోజకవర్గ పరిధిలో సామూహిక వివాహాలు జరిపించేందుకు నిర్ణయించారు.గురువారం పటాన్చెరు పట్టణంలోని మైత్రి మైదానంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సామూహిక వివాహాల కార్యక్రమ వివరాలను ఎమ్మెల్యే జిఎంఆర్ వెల్లడించారు.పటాన్చెరు నియోజకవర్గ అభివృద్ధిలో ప్రభుత్వంతోపాటు ప్రజలకు సేవలు అందించడంలో భాగంగా తమ కుటుంబం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జివిఆర్ ఎంటర్ప్రైజెస్ సౌజన్యంతో చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా సామూహిక వివాహ కార్యక్రమాలు నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.ప్రజా ప్రతినిధులు, పుర ప్రముఖులు, వేద బ్రాహ్మణులతో చర్చించిన అనంతరం మే 7వ తేదీ, ఆదివారం పటాన్చెరు పట్టణంలోని జిఎంఆర్ ఫంక్షన్ హాల్ లో సంప్రదాయబద్ధంగా సామూహిక వివాహాలు జరిపేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలిపారు.

మొదటగా హిందువుల సామూహిక వివాహాలు జరిపించిన అనంతరం, ముస్లిం, క్రిస్టియన్ల మత పెద్దలతో చర్చించి వారికి సంబంధించిన సామూహిక వివాహాల తేదీని ప్రకటిస్తామని తెలిపారు.దీనికోసం అర్హులైన హిందువుల జంటలు తమ తమ మండలాల పరిధిలోని ఎంపీడీవో, తహసిల్దార్ కార్యాలయాల్లో పేర్లను నమోదు చేసుకుని రసీదులు పొందాలని సూచించారు.సామూహిక వివాహాల్లో వివాహం చేసుకున్న జంటలకు ప్రభుత్వం తరఫున కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ పథకాలు వర్తింప చేస్తామని పేర్కొన్నారు.గతంలో తాను ఎంపీపీగా పని చేసినప్పుడు 20 జంటలకు సామూహిక వివాహాలు జరిపించినట్లు గుర్తు చేశారు.మానవసేవయే మాధవసేవ అన్న నానుడికి అనుగుణంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, భారత రాష్ట్ర సమితి సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

admin

Recent Posts

సమాజానికే సందేశం గాంధీజీ జీవన విధానం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…

6 days ago

మాతృభూమిపై మమకారాన్ని చాటే అపూర్వ అవకాశం వికసిత్ భారత్ రన్‌

మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…

2 weeks ago

కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు కొనసాగిస్తాం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…

2 weeks ago

గొప్ప గాంధేయవాది కొండా లక్ష్మణ్ బాపూజీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…

2 weeks ago

పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేవి సైన్స్ ఎగ్జిబిషన్ లు

- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…

3 weeks ago

వికలాంగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…

3 weeks ago