మనవార్తలు , పటాన్ చెరు:
తెలంగాణ లో బిజెపి పార్టీ మరో పోరాటానికి సిద్ధమైంది రాష్ట్రంలో నిరుద్యోగుల తరుపున మరో మారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుబండి సంజయ్ చేస్తున్న దీక్షకు మద్దతు ఇవ్వాలని పటాన్ చెరు మాజీ జెడ్పీటీసీ, బీజేపీ ఓబీసీ మోర్చ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడీల శ్రీకాంత్ గౌడ్ పిలుపునిచ్చారు .ఇస్నాపూర్ లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమవేశంలో మాట్లాడుతూ ఈనెల 27న ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద బీజేపీ తెలంగాణ శాఖ అధ్వర్యంలో ఒక రోజు నిరుద్యోగ నిరసన దీక్ష చేపడ్తున్నా బండి సంజయ్ నిరుద్యోగ దీక్ష నిర్వహించన్నురని తెలిపారు .
నీళ్లు ,నిధులు నియమాకాలు నినాదంతో తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది యువకులు పాల్గొన్నారని , టీఆరెఎస్ పార్టీ అధికారంలోకి వస్తే నిరుద్యోగ భృతి అమలు చేస్తామని 2018లో రెండవ సారి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ మూడుయేళ్లు దాటినా ఈ హామీని నెరవేర్చలేదు,ఉద్యోగాలు లేక నిరుద్యోగ భృతి అందక యువత ఆవేదనలో ఉంటే కేసీఆర్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని మండి పడ్డారు. ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయకపోతే రాబోయే ఎలక్షన్స్ లో టీఆరెఎస్ పార్టీకి బుద్ధిచెప్తారని అన్నారు
ఒక రోజు నిరుద్యోగ నిరసన దీక్షకు రాష్ట్ర నలుమూలల నుంచి నిరుద్యోగులు, యువత పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని బీజేపీ ఓబీసీ మోర్చ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడీల శ్రీకాంత్ గౌడ్ పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో సరోత్తం రెడ్డి, జోగు ధన్ రాజ్, దుర్గా సాయి తదితరులు పాల్గొన్నారు
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…
చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…
రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…
పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…
నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…