అమీన్‌పూర్, మనవార్తలు ప్రతినిధి:
ఈ నెల 22వ తేదీన బీరంగూడ డివిజన్ పరిధిలోని బీరంగూడ గుట్టపై నూతనంగా నిర్మించిన శ్రీశ్రీశ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో నిర్వహించ తలపెట్టిన విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని దిగ్విజయవంతం చేయాలని పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గురువారం ఉదయం స్థానిక నాయకులు, ఆలయ కమిటీ సభ్యులతో కలిసి ఆలయాన్ని పరిశీలించారు. అయ్యప్ప స్వామి అనుగ్రహం భక్తుల సహాయ సహకారాలతో కేవలం 365 రోజుల సమయంలోనే ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేయడం జరిగిందని అన్నారు. 22వ తేదీన నిర్వహించబోయే విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు, భక్తులు, ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. భక్తుల సంఖ్యకు అనుగుణంగా పూర్తి స్థాయి ఏర్పాట్లు చేయాలని ఆలయ కమిటీ సభ్యులకు సూచించారు. అదేవిధంగా బీరంగూడ గుట్టపై రాజరాజేశ్వరి దేవి ఆలయం నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. అనంతరం స్థానిక వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, మాజీ వైస్ చైర్మన్ నందారం నరసింహా గౌడ్, మాజీ కౌన్సిలర్ కొల్లూరి మల్లేష్, మాజీ ఎంపీటీసీ అనిల్, మాజీ సర్పంచ్ డోక్కూరి రామ్మోహన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
400 మందికి పైగా ప్రజలకు ఉచిత వైద్య సేవలు సేవా కార్యక్రమాలతో ప్రజలకు మరింత చేరువవుతున్న మియాపూర్ యువ నాయకుడు…
ఐఐటి చుక్కారామయ్య స్పూర్తితో విద్యార్థులకు ఒత్తిడి లేని విద్యను అందిస్తు మెరుగైన ఫలితాలు సాధిస్తున్న ఇష్టా విద్యాసంస్థలు పటాన్‌చెరు, మనవార్తలు…
సొంత నిధులతో స్పోర్ట్స్ కిట్స్ పంపిణీ పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి: పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి క్రీడాకారుల పట్ల…
10 లక్షల రూపాయల విరాళం అందజేత భవిష్యత్తులోనూ ఆలయ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తానని హామీ ప్రజల్లో భక్తిభావం, ఆధ్యాత్మిక…
భారత ప్రభుత్వ శాస్త్ర, సాంకేతిక విభాగం, క్వాంటం మిషన్ సహకారంతో ఆరు రోజుల శిక్షణ పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి: అభివృద్ధి…
పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి: సిద్దిపేటలో గురువారం నిర్వహించిన భారీ బహిరంగ సభకు హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హెలిప్యాడ్ వద్ద…