చాకలి ఐలమ్మ ఆశయాలే మనకు స్ఫూర్తి
పేదల హక్కుల కోసం పోరాడుదాం!
మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు:
చాకలి ఐలమ్మ చూపిన ధైర్యం, పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమని సిపిఎం పార్టీ ఏరియా కమిటీ సభ్యులు వాజిద్ అలీ అన్నారు.వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా సీపీఐ(ఎం) పటాన్‌చెరు ఏరియా కమిటీ ఆధ్వర్యంలో శ్రామిక్ భవన్ లో ఆమె చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వాజిద్ అలీ మాట్లాడుతూ చాకలి ఐలమ్మ చూపిన ధైర్యం, పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమని ఆమె అడుగుజాడల్లో ముందుకు వెళ్దాం అన్నారు.తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట కాలంలో భూస్వామ్య దోపిడీకి, వెట్టిచాకిరీకి వ్యతిరేకంగా చాకలి ఐలమ్మ ధైర్యంగా నిలబడి పోరాడారని గుర్తు చేశారు. తన భూమిని, తన హక్కులను కాపాడుకోవడానికి ఆమె చూపిన తెగువ పేదలు, రైతులు, మహిళలకు స్ఫూర్తినిచ్చిందన్నారు. అణగారిన వర్గాల హక్కుల కోసం ఆమె చేసిన పోరాటాన్ని స్మరించుకుంటూ, సమాజంలో దోపిడీ, వివక్ష, అన్యాయాలకు వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.చాకలి ఐలమ్మ కేవలం ఒక వ్యక్తి మాత్రమే కాదని, పేదల ఆత్మగౌరవానికి, మహిళల ధైర్యానికి, భూమి కోసం జరిగిన రైతాంగ పోరాటానికి ప్రతీక అని అన్నారు. ఆమె ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే ఆమెకు ఇచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) పటాన్‌చెరు ఏరియా కమిటీ సభ్యులు మల్లేష్, మూర్తి, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు టి. అర్జున్, ఎస్ఎఫ్ఐ పటాన్‌చెరు డివిజన్ కార్యదర్శి శంసుంగ్, ఎస్ఎఫ్ఐ నాయకులు వెంకటేష్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
-విగ్రహ ధ్వంసాన్ని నిరసిస్తూ నర్సాపూర్‌లో విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మల భారీ ర్యాలీ -దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ -ఆలయ పున ప్రతిష్ఠకు…
ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన నటీమణులు రితు చౌదరి, వర్ష, రుక్సార్ పటేల్ నవంబర్ 15 నుంచి 17 వరకు నోవోటెల్…
పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి: ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించిన బీఆర్ఎస్ ఇంచార్జ్ గడీల శ్రీకాంత్ గౌడ్ అన్నారు .ఇస్నాపూర్ మున్సిపల్…
రామచంద్రపురం , మనవార్తలు ప్రతినిధి: మత సామరస్యం, సోదరభావంతో కూడిన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అని…
పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి: పటాన్‌చెరు: ఉత్తర భారతీయులు భక్తిశ్రద్ధలతో జరుపుకునే పవిత్ర ఛట్ పూజను పురస్కరించుకుని యండిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో…
పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి: హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ అండ్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ విభాగం పరిశోధక…