పటాన్చెరు:
కౌటిల్యా స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ (కేఎస్ పీపీ) ని ఆగస్టు 15న 75వ స్వాతంత్ర్య దినోత్సవం నాడు గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్‌లో అధ్యక్షుడు ఎం.శ్రీభరత్ ఘనంగా ప్రారంభించారు. విధాన నిర్ణేతలకు అవసరమైన జ్ఞానం, నైపుణ్యాలు, దార్శనికతలను అందించాలనే లక్ష్యంతో దీనిని నెలకొల్పారు. ఈ సందర్భంగా శ్రీభరత్ మాట్లాడుతూ తన బాల్యం నుంచి ఓ ప్రతిష్టాత్మక విద్యా సంస్థకు అధ్యక్షుడిగా ఎదిగే వరకు జరిగిన ముఖ్య పరిణామాలు, ఎదుర్కొన్న సవాళ్ళను వివరించారు. విద్యార్థులు, అధ్యాపకులు సంధించిన పలు ప్రశ్నలకు సమయస్ఫూర్తితో యుక్తిగా జవాబులిచ్చి ఆకట్టుకున్నారు. విధానం, ప్రణాళిక అనే అంశాలపై గీతం హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్ సవివరంగా ప్రసంగించారు.
ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ వచ్చే వరకు నెహ్రూ విధానాలే అమలు జరిగాయన్నారు. పంచవర్ష ప్రణాళికలలో అభివృద్ధిని లక్ష్మీస్తూ నీటిపారుదల, పరిశ్రమలు, విద్య వంటి రంగాల ఉన్నతికి బాటలు వేసినట్టు చెప్పారు. దురదృష్టవశాత్తూ వినూత్న ఆలోచనలల్లో మనం వెనుకంజ వేశామని, ఇకపై మనమంతా వస్తూత్పత్తి పరిశోధనలపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. విధాన నిర్ణేతల కోసం గీతం వైపు చూసే రోజు భవిష్యత్తులో వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…
ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…
భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…
భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…
సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల సిఎస్ఆర్ నిధులు స్థానిక…