రామచంద్రాపురం, మనవార్తలు :
ఎల్బీనగర్ లో నిన్న జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల పైన నాయకుల పైన లాఠీచార్జి నిరసనగా పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు తెల్లాపుర్ మునిసిపాలిటీ ఇంద్రానగర్ లోని స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మరియు మంత్రి కేటీఆర్ దిష్టిబొమ్మ లు దహనం చేసిన తెల్లాపుర్ మునిసిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పర్స శ్యామ్ రావు మరియు కాంగ్రెస్ నాయకులు మాజీ సర్పంచ్ శ్రీనివాస్ మాజీ వైస్ ప్రెసిడెంట్ ప్రభాకర్ రెడ్డి, వడ్డే నర్సింహ, నవరి జైపాల్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, యూత్ ప్రెసిడెంట్ సాయి నాథ్ రెడ్డి, వినోద్ కుమార్, సాయి, వేణు కార్యకర్తలు పాల్గొన్నారు.
