మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు :
ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం నలుగురు ప్రతిభావంతులకు బంగారు పతకాలు బహుకరణ కౌటిల్యా స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ (కేఎస్ పీపీ) తన నాలుగో స్నాతకోత్సవాన్ని ఏప్రిల్ 10, 2026న హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమం ఒక లాంఛనప్రాయ విద్యా ఊరేగింపు (అకడమిక్ ప్రొసెషన్) తో ప్రారంభమై, సందర్భానికి తగ్గ గౌరవప్రదమైన వాతావరణాన్ని కల్పించింది.ఈ వేడుకలో నీతి ఆయోగ్ పూర్వ ముఖ్య కార్యనిర్వహణాధికారి, భారతదేశపు జీ-20 షెర్చా అమితాబ్ కాంత్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తన ప్రసంగంలో, ఆయన నూతన ఆవిష్కరణలు, సమగ్రత, దేశ నిర్మాణానికి ప్రాధాన్యత నిస్తూ, ప్రజా విధానం, పరిపాలనకు అర్థవంతంగా దోహదపదాలని పట్టభద్రులైన విద్యార్ధులను ప్రేరేపించారు.క్షేత్రస్థాయి పరిపాలన ప్రాముఖ్యతను హైలైట్ చేస్తూ, భారతదేశ సమాఖ్య నిర్మాణంలో కీలకమైన రాష్ట్రాలు, జిల్లాలతో మమేకమవ్వాలని అమితాబ్ కాంత్ విద్యార్థులను కోరారు. తయారీ రంగంలో వాటాను పెంచడం, వ్యాపార వ్యయాన్ని తగ్గించడం ద్వారా భారతదేశాన్ని ప్రపంచ తయారీ కేంద్రంగా మార్చాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ‘జన విశ్వాస్’ (ప్రజా విశ్వాసం)కు ప్రాధాన్యతనిస్తూ, ఎగుమతులను పెంచడానికి, భారతదేశ ప్రపంచ పోటీతత్వాన్ని మెరుగు పరచడానికి విశ్వాసాన్ని బలపేతం చేయడం, వ్యాపార పరిస్థితులను మెరుగుపరచడం చాలా కీలకమన్నారు. భారతదేశ జనాభాలో దాదాపు 46 శాతం మంది వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారని పేర్కొంటూ, వ్యవసాయ ఉత్పాదకతను మెరుగుపరచడం యొక్క ప్రాముఖ్యతను కూడా వివరించారు.
ప్రపంచ ప్రమాణాలతో భారతదేశ వ్యవసాయ, పారిశ్రామిక పనితీరును బేరీజు వేసుకోవాలని ఆయన పట్టభద్రులను ప్రోత్సహించారు.బలమైన ఆవిష్కరణ వ్యవస్థ కోసం పిలుపునిస్తూ, పరిశోధన, అభివృద్ధిని ప్రోత్సహించాలని, స్టార్టప్ లకు మద్దతు ఇవ్వాలని, రిస్క్ క్యాపిటల్ ను పొందేందుకు వీలు కల్పించాలని అమితాబ్ కాంత్ విద్యార్థులను కోరారు. 30 ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్థగా ఎదగాలన్న భారతదేశ ఆశయాన్ని ఆయన ప్రముఖంగా ప్రస్తావిస్తూ. ఈ దార్శనికతను సాధించడంలో యువ నిపుణులు కీలక పాత్ర పోషిస్తారని పేర్కొన్నారు. భారతదేశ పురోగతిని గురించి ప్రస్తావిస్తూ. మౌలిక సదుపాయాలు, పునరుత్పాదక ఇంధనం, డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలలో వేగవంతమైన పురోగతిని ఆయన ఉదహరించారు. డిజిటల్ చెల్లింపులలో నాయకత్వం, కోడివ్-19 వ్యాక్సినేషన్ల వంటి భారీస్థాయి ప్రజా సేవల పంపిణీని కూడా ఆయన ప్రస్తావించారు. కృత్రిమ మేధస్సు, ఆరోగ్య సంరక్షణ, పోషణ వంటి రంగాలలో డిజిటల్ పబ్లిక్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ (డీపీఐ) యొక్క పరివర్తనాత్మక సామర్థ్యాన్ని ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు,
రిజిస్ట్రార్ డాక్టర్ డి.గుణశేఖరన్, గీతం ఉప కులపతి ప్రొఫెసర్ ఎర్రోల్ డిసౌజా సంతకం కోసం డిగ్రీ రికార్డులను సమర్పించారు. విద్యార్థి ప్రతినిధి అనుష్క శర్మ స్నాతకోత్సవ ప్రసంగం చేయగా, కేఎస్ పీపీ అధ్యాపకురాలుగీతం హైదరాబాదు అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ. ఎస్. రావు విద్యార్థి ప్రతినిధి సెహజానా కాంట్రాక్టర్ తో ప్రమాణ స్వీకారం ప్రతిని అందించి, ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు. మొత్తం 35 మంది విద్యార్థులకు వార్ డిగ్రీలతో పాటు, విద్యా నైపుణ్యాన్ని గుర్తించే మెరిట్ పతకాలను ప్రదానం చేశారు. పబ్లిక్ పాలసీ మాస్టర్స్ ప్రోగ్రామ్ లో మొదటి ర్యాంకు సాధించిన అభిజీత్ సుధీర్ రౌత్ కు అధ్యక్షుడి పేరిట నెలకొల్పిన బంగారు పతకం ఇచ్చి సత్కరించారు. ఉత్తమ క్యాప్ స్టోన్ ప్రాజెక్టుకు గాను సిమ్రాన్ కౌర్ డీన్ బంగారు పతకాన్ని అందుకున్నారు. యనమండ్ర మల్లికార్జునరావు స్మారక బంగారు పతకాన్ని అభిజీత్ సుధీర్ రౌత్, అమల్ శుక్లాలకు సంయుక్తంగా ప్రదానం చేశారు.రిజిస్ట్రార్ డాక్టర్ డి. గుణశేఖరన్, గీతం ఉప కులపతి ప్రొఫెసర్ ఎర్రోల్ డిసౌజా సంతకం కోసం డిగ్రీ రికార్డులను సమర్పించారు. విద్యార్థి ప్రతినిధి అనుష్క శర్మ స్నాతకోత్సవ ప్రసంగం చేయగా, కేఎస్ వీపీ ఆధ్యాపకురాలు డాక్టర్ వసుధా కడ్డు వందన సమర్పణ చేశారు. కేఎస్ పీపీ డీన్ ప్రొఫెసర్ సయ్యద్ అక్బరుద్దీన్ కూడా పాల్గొన్నారు.పబ్లిక్ పాలసీ, పరిపాలన రంగంలో తమ వృత్తి ప్రస్థానాన్ని ప్రారంభించనున్న పట్టభద్రుల బృందానికి ఈ కార్యక్రమం ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది.
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…
ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…
భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…
భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…
సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల సిఎస్ఆర్ నిధులు స్థానిక…
మనవార్తలు ప్రతినిధి ,శేరిలింగంపల్లి : రాయదుర్గం, దర్గా, మదర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎ. భరత్ కుమార్ గౌడ్ గచ్చిబౌలి డివిజన్…