బీఆర్ఎస్ బలోపేతానికి పటాన్ చెరులో కీలక నాయకుల చేరిక

politics Telangana

-పటాన్ చెరులో బిఆర్ఎస్ శక్తి ప్రదర్శన

-హరీష్ రావు నాయకత్వంపై నమ్మకంతో కీలక నేతల భారీ చేరిక

-నియోజకవర్గ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు తెర

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పటాన్ చెరు నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ప్రజా సమస్యలపై ప్రభుత్వంపై అసంతృప్తి పెరుగుతున్న సమయంలో, బిఆర్ఎస్ పార్టీ దూకుడు పెంచుతూ ఎన్నికల సమరానికి సిద్ధమవుతున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కోకాపేటలోని మాజీ మంత్రి హరీష్ రావు గారి నివాసంలో జరిగిన కీలక కార్యక్రమం ఈ పరిణామానికి నిదర్శనంగా నిలిచింది.ప్రజా వ్యతిరేక విధానాలతో పాలన సాగిస్తున్న ప్రభుత్వానికి బిఆర్ఎస్ సరైన ప్రత్యామ్నాయమని వ్యాఖ్యానించారు.

పటాన్ చెరు మాజీ జెడ్పీటీసీ, మండల ఇంచార్జ్ గడిల శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో, మాజీ మంత్రి హరీష్ రావు సమక్షంలో పటాన్ చెరు మాజీ ఎంపీపీ శ్రీశైలం యాదవ్, రుద్రారం పిఎ సిఎస్ చైర్మన్ పాండు, మాజీ పిఎ సిఎస్ చైర్మన్ నలగండ్ల వెంకట్ రెడ్డిలు బిఆర్ఎస్ పార్టీలో చేరి పార్టీ కండువా కప్పుకున్నారు . అనంతరం హరీష్ రావు మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వ పాలనలో అభివృద్ధి నిలిచిపోయిందని, హామీలు అమలుకాలేదన్న ఆరోపణలు గ్రామీణ ప్రాంతాల్లో బలంగా వినిపిస్తున్నాయి. రైతులు, సహకార సంఘాలు, గ్రామస్థాయిలోని నాయకులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, అదే అసంతృప్తి బి ఆర్ఎస్ వైపు మొగ్గుచూపుతున్నారని తెలిపారు .తెలంగాణను అభివృద్ధి పథంలో ముందుకు నడిపించిన పార్టీ బీఆర్ఎస్ అని, ప్రజలు మళ్లీ ఆ పాలనను కోరుకుంటున్నారని స్పష్టం చేశారు. అనుభవం ఉన్న నాయకులు బీఆర్ఎస్‌లో చేరడం ప్రజల్లో పెరుగుతున్న విశ్వాసానికి నిదర్శనమన్నారు.

ప్రజల ఆశీర్వాదంతో మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అనుభవజ్ఞులైన నాయకులు పార్టీలో చేరడం పార్టీకి మరింత ఉత్సాహం ఇచ్చిందన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ మరింత బలోపేతం దిశగా ముందుకుసాగుతున్న తరుణంలో పటాన్ చెరు నియోజకవర్గంలో కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది.ఈ కార్యక్రమంలో పటాన్ చెరు నియోజకవర్గ ఇంచార్జ్ ఆదర్శ్ రెడ్డి, ఇస్నాపూర్ మాజీ సర్పంచ్ బూరిగారి వెంకట్ రెడ్డి,  మీరాజ్ ఖాన్, చిట్కుల్, రుద్రారం గ్రామాల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *