Telangana

ఈ నెల 26న కౌటిల్య కొలోక్వి

నాలుగవ ఎడిషన్ ను ప్రకటించిన కౌటిల్య స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు:

గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాదులోని కౌటిల్య స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ (కె.ఎస్.పి.పి) ఈనెల 26న కౌటిల్య కొలోక్వి నాల్గవ ఎడిషన్ కు ఆతిథ్యం ఇవ్వనుంది. సృజనాత్మక భాగస్వామ్యం, వాస్తవ ప్రపంచ విధాన సంభాషణల సమ్మేళనంగా ఇది సాగనుంది. విద్యార్ధులే నిర్వహించే ఈ ప్రతిష్టాత్మక విద్యా సదస్సు, పరిపాలన, ప్రజా విధానంలోని కీలకమైన ప్రశ్నలపై చర్చించడానికి పండితులు, పరిశోధకులు, విధాన రూపకర్తలు, నిపుణులు, విద్యార్థులను ఒకచోట చేర్చుతుంది.’విధాన మార్గాలు: మూలాల నుంచి మార్గాల వరకు’ అనే ఇతివృత్తంతో జరిగే ఈ ఎడిషన్, చారిత్రక వారసత్వాలు, సమకాలీన ఎంపికలు, ఉద్భవిస్తున్న అవకాశాల ద్వారా కాలక్రమేణా ప్రజా విధానం ఎలా పరిణామం చెందుతుందో అన్వేషిస్తుంది. ముఖ్య ప్రసంగాలు, ప్యానెల్ చర్చలు, పరిశోధన ప్రజెంటేషన్లు, ముఖాముఖి చర్చలు ఉంటాయి. గత కొన్నేళ్లగా, ఈ సదస్సు వివిధ రంగాల మధ్య చర్చలు, విధాన ఆవిష్కరణల కోసం ఒక శక్తివంతమైన వేదికగా అందిస్తోంది. ఇప్పటివరకు, 500 మందికి పైగా సదస్యులను, 50 మందికి పైగా ప్రముఖ వక్తలను, 150కి పైగా పరిశోధన సమర్పణలను, 40కి పైగా పీర్-రివ్యూడ్ పేపర్ ప్రజెంటేషన్లను ఒకచోట చేర్చింది.

ఈ సదస్సులో, ‘నీతి-ఇన్-క్వెస్ట్’ అనే ఆసక్తికరమైన ఇద్దరు సభ్యుల పాలసీ క్యిజ్ ఉంటుంది. ఇది గుంతలు, రేషన్ కార్డుల నుంచి మీమ్స్, నిరసనలు, సినిమా, పౌర జీవితం వరకు నిత్య భారతదేశాన్ని ఆధారాలుగా మారుస్తుంది. సమకాలీన విషయాలు, దృశ్య-శ్రవణ ఆధారాలు, పాప్ కల్చర్, పాలసీ పజిల్స్, నిజ జీవిత పరిస్థితులను మిళితం చేస్తూ, ఈ క్విజ్ పరిశీలన, జట్టు కృషి, విచక్షణ, సంబంధాలను గుర్తించే సామర్థ్యాలను పరీక్షిస్తుంది. గెలుపొందిన జట్టుకు 20 వేల రూపాయల బహుమతిని ప్రదానం చేస్తారు.మరో ముఖ్యమైన అంశం, ‘పాలసీ ప్లే’, ఇందులో పాల్గొనేవారిని ఐదు నిమిషాల చిన్న బ్లాగులు, సృజనాత్మక కథల ద్వారా నిజ జీవిత పాలసీ అనుభవాలను అన్వేషించడానికి ఆహ్వానిస్తున్నారు. ఇందులో పాల్గొనేవారు నాయకత్వం, పరిపాలన, ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి, సుస్థిరత, పర్యావరణ భవిష్యత్తులు, భౌగోళిక రాజకీయాలు, భద్రత, సాంకేతికత, డిజిటల్ సమాజం వంటి అంశాలపై కథలు చెప్పాచ్చు. ఈ పోటీలో మొత్తం 15 వేల రూపాయల మూడు బహుమతులు ఉంటాయి.

చివరగా, ఈ సదస్సు ప్రధానాంశం- పరిశోధనా పత్రాల సమర్పణే. ఇవి పాల్గొనేవారికి తమ మౌలికమైన పనిని ప్రదర్శించడానికి, నిపుణులతో సంభాషించడానికి, నిర్మాణాత్మక విద్యాపరమైన అభిప్రాయాన్ని స్వీకరించడానికి ఒక అవకాశాన్ని అందిస్తాయి. సంస్థలు, పరిపాలన, సామాజిక, పర్యావరణ పరివర్తన, ఆర్ధిక-ద్రవ్య పాలన, సాంకేతిక పాలన, అభివృద్ధి చెందుతున్న విధాన సవాళ్లతో సహా విభిన్న రంగాల నుంచి పత్ర సమర్పణలను ఆహ్వానిస్తున్నారు. ఎంపిక చేసిన వాటిని జాతీయ స్థాయి ప్రచురణకోసం పరిగణనలోకి తీసుకుంటారు. ఇందులో 25 వేల రూపాయల మొదటి, 20 వేల రూపాయల రెండవ బహుమతి ఉంటాయి.ఈ సదస్సు తన ఇతివృత్తాన్ని మూడు దృక్కోణాల ద్వారా రూపొందిస్తుంది. అవి సంస్థాగత, విధాన వారసత్వాలను పరిశీలించే ‘వారసత్వ భవిష్యత్తులు’, ప్రస్తుత నిర్ణయాలు దీర్ఘకాలిక విధానాలను ఎలా రూపొందిస్తాయో అన్వేషించే ‘భవిష్యత్తును ఊహించడం’. ప్రత్యామ్నాయ మార్గాలను పునఃపరిశీలించడం. అన్వేషించని భవిష్యత్తులను ఊహించడం ‘అద్దం’.

ఆలోచనలు, భాగస్వామ్యం, గుర్తింపు కోసం ఒక వేదికను ఈ కొలోక్యి అందించనుంది. ఇందులో పాల్గొనేవారికి మేధోపరమైన మార్పిడి, గుర్తింపు కోసం అవకాశాలను అందిస్తుంది. పరిపాలన, ప్రజా విధానంపై ఆసక్తి ఉన్న విద్యార్థులు, పరిశోధకులు, నిపుణుల కోసం ఈ సదస్సు ఆహ్వానం పలుకుతోంది. ఇందులో పాల్గొన్న వారందరికీ ధృవపత్రాలు అందజేస్తారు.నిశితమైన పాండిత్యం, సృజనాత్మక భాగస్వామ్యం, వాస్తవ ప్రపంచ సంభాషణల సమ్మేళనంతో, గతానుభవాల నుంచి నేర్చుకున్న పాఠాలు వర్తమాన నిర్ణయాలకు ఎలా మార్గదర్శనం చేయగలవో, భవిష్యత్తు కోసం మరింత సమ్మిళిత, వినూత్న విధాన మార్గాలను ఎలా రూపొందించగలవో అన్వేషించడమే ఈ సదస్సు లక్ష్యం. మరిన్ని వివరాలకు https://www.kspp.edu.in/colloquu

admin

Recent Posts

నందిగామ సర్పంచ్ విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో రుద్రారం గణేష్ గడ్డ వరకు పాదయాత్ర

భక్తుల సౌకర్యార్థం సొంత నిధులతో రోడ్డు నిర్మాణం ఐదు లక్షల రూపాయలు అందజేత విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో అన్నదానం  భక్తులకు…

2 hours ago

రుద్రారం శ్రీ గణేష్ దేవస్థానంలో వైభవంగా బ్రహ్మోత్సవాలు

విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో అన్నదానం భక్తులకు స్వయంగా అన్నప్రసాదం వడ్డించిన కాట శ్రీనివాస్ గౌడ్ దంపతులు మనవార్తలు ప్రతినిధి ,పటాన్…

2 hours ago

పర్యావరణ శాస్త్రంలో కెజియా ఎలిజబెత్ కు పీహెచ్.డీ

మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ సైన్స్, పర్యావరణ శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థిని ఎం.…

8 hours ago

సేవా కార్యక్రమాలతో జీఎంఆర్ జన్మదిన వేడుకలు

-పరమేష్ యాదవ్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ -ఈఎస్ఐ ఆస్పత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : పటాన్‌చెరు…

20 hours ago

రామచంద్రాపురంలో ఘనంగా ఎమ్మెల్యే జిఎంఆర్ జన్మదిన వేడుకలు

-ఐలేష్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ -ఈఎస్ఐ ఆస్పత్రిలో రోగులకు పండ్ల పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం…

20 hours ago

పూరి బీచ్‌పై మెరిసిన ఎమ్మెల్యే జిఎంఆర్ సైకత శిల్పం

ఎమ్మెల్యే జన్మదినానికి అభిమానుల వినూత్న కానుక అభిమానానికి ప్రతి రూపంగా ప్రత్యేక బహుమతి అందించిన బిఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకుడు…

20 hours ago