Telangana

సమానత్వం కోసం పోరాడిన తత్వవేత్త జ్యోతిరావు పూలే

ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం 

నీలం మధు ముదిరాజ్

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు :

మనుషులంతా అన్ని రంగాల్లో సమానత్వంతో జీవించాలని, ఆధిపత్య విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ తన జీవితాన్ని ధారపోసిన భారతీయ సామాజిక తత్వవేత్త, బడుగు, బలహీన వర్గాల ఆశా జ్యోతి మహాత్మా జ్యోతిరావు ఫూలే అని, ఆయన ఆశయాలు, కార్యాచరణ నేటికీ స్పూర్తిదాయకమని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి నీలం మధు ముదిరాజ్ అన్నారు.శనివారం చిట్కుల్ లోని ఆయన నివాసంలో మహాత్మా జ్యోతిబా పూలె 200వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పూలె చిత్ర పటానికి నీలం మధు పూల మాల వేసి నివాళ్లు అర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజిక దార్శనికుడుగా, సంఘసంస్కర్తగా, వర్ణ వివక్ష వ్యతిరేక పోరాటానికి బాటలు వేసిన మహనీయుడు ఫూలే అన్నారు. వివక్షలేని సమానత్వ సమాజం కోసం జీవితాంతం శ్రమించిన గొప్ప సామాజిక తత్వవేత్త జ్యోతిబా ఫూలే అని కొనియాడారు. పూలే ఆశయాలు, ఆశలకు అనుగుణంగా సంబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన సాగిస్తున్నారని స్పష్టం చేశారు. దేశంలోనే ఎక్కడ లేని విధంగా దశాబ్దాలుగా ప్రజల న్యాయబద్ధ డిమాండ్లైన బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ కోసం అసెంబ్లీలో తీర్మానం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.

admin

Recent Posts

ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ లైవ్ కాన్సర్ట్‌కు ఏప్రిల్ 26న బౌల్డర్ హిల్స్‌లో

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…

5 hours ago

ఘనంగా కేఎస్ పీపీ 4వ స్నాతకోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…

22 hours ago

క్రీడలు నిత్య జీవితంలో భాగం కావాలి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…

22 hours ago

గుమ్మడిదల రైతులకు న్యాయం చేయండి

భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…

3 days ago

· కాలుష్యం మాకు.. రోగాలు మాకూ.. అభివృద్ధి మీకా

సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల  సిఎస్ఆర్ నిధులు స్థానిక…

3 days ago

నాగార్జున ఉన్నత పాఠశాలలో మహిళలకు స్వయం ఉపాధి కోసం ఉచిత టైలరింగ్ కార్యక్రమం ప్రారంభోత్సవం

మనవార్తలు ప్రతినిధి ,శేరిలింగంపల్లి : రాయదుర్గం, దర్గా, మదర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎ. భరత్ కుమార్ గౌడ్ గచ్చిబౌలి డివిజన్…

3 days ago