Telangana

టియుడబ్ల్యూజే హెచ్143 జాతీయ, రాష్ట్ర కౌన్సిలకు ఎంపికైన పటాన్ చెరు జర్నలిస్టులు

పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి:

తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (హెచ్) – 143 యూనియన్ జాతీయ కౌన్సిల్, రాష్ట్ర కౌన్సిల్‌కు ఇటీవల నిర్వహించిన ఎన్నికల్లో పటాన్ చెరు నియోజకవర్గానికి చెందిన పలువురు జర్నలిస్టులు వివిధ హోదాలకు ఎంపికయ్యారని యూనియన్ ఉమ్మడి మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి యాదగిరి గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు.జాతీయ కౌన్సిల్ సభ్యులుగా సీనియర్ జర్నలిస్టులు ఆనంద్ కుమార్, ప్రమోద్ కుమార్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా సీనియర్ జర్నలిస్టులు వడ్ల శ్రీధర్, కొంక రాజ్ కిషోర్ బాబులు ఎంపికయ్యారని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కౌన్సిల్ సభ్యులు జర్నలిస్టుల హక్కుల సాధనలో కీలక పాత్ర పోషించాలని సూచించారు.పటాన్ చెరు నియోజకవర్గ జర్నలిస్టులకు జాతీయ, రాష్ట్ర స్థాయిలో అవకాశం కల్పించడం పట్ల యూనియన్ పటాన్ చెరు నియోజకవర్గ అధ్యక్షులు రాఘవరెడ్డి, ప్రధాన కార్యదర్శి అంతారం మహేష్ గౌడ్, TEMJU అధ్యక్షులు శేఖర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి రామకృష్ణ లు రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. నూతన సభ్యులకు శుభాభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కౌన్సిల్ సభ్యులు మాట్లాడుతూ తమపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తామని తెలిపారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం, హక్కుల పరిరక్షణ, సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తామని పేర్కొన్నారు. జర్నలిస్టులందరినీ ఐక్యంగా ముందుకు తీసుకెళ్తూ యూనియన్ బలోపేతానికి తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. తమ ఎంపికకు సహకరించిన రాష్ట్ర అధ్యక్షులు ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ కి, ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్ లకు,టెంజు రాష్ట్ర అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి ల కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

admin

Recent Posts

యలమంచి ఉదయ్ కిరణ్ ఆధ్వర్యంలో 9వ మెగా మెడికల్ క్యాంప్

400 మందికి పైగా ప్రజలకు ఉచిత వైద్య సేవలు సేవా కార్యక్రమాలతో ప్రజలకు మరింత చేరువవుతున్న మియాపూర్ యువ నాయకుడు…

20 hours ago

ఘనంగా ఐఐటి చుక్కారామయ్య 101 వ పుట్టినరోజు వేడుకలు

ఐఐటి చుక్కారామయ్య స్పూర్తితో విద్యార్థులకు ఒత్తిడి లేని విద్యను అందిస్తు మెరుగైన ఫలితాలు సాధిస్తున్న ఇష్టా విద్యాసంస్థలు పటాన్‌చెరు, మనవార్తలు…

20 hours ago

క్రీడాకారులకు అండగా ఎమ్మెల్యే జిఎంఆర్

సొంత నిధులతో స్పోర్ట్స్ కిట్స్ పంపిణీ  పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి: పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి క్రీడాకారుల పట్ల…

1 day ago

బీరంగూడ అయ్యప్పస్వామి దేవాలయానికి ఎమ్మెల్యే జిఎంఆర్ భారీ విరాళం

10 లక్షల రూపాయల విరాళం అందజేత భవిష్యత్తులోనూ ఆలయ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తానని హామీ ప్రజల్లో భక్తిభావం, ఆధ్యాత్మిక…

1 day ago

క్వాంటం టెక్నాలజీపై అధ్యాపక వికాస కార్యక్రమం

భారత ప్రభుత్వ శాస్త్ర, సాంకేతిక విభాగం, క్వాంటం మిషన్ సహకారంతో ఆరు రోజుల శిక్షణ పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి: అభివృద్ధి…

1 day ago

సభను విజయవంతం చేసిన ప్రజలకు కృతజ్ఞతలు : నీలం మధు ముదిరాజ్

పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి: సిద్దిపేటలో గురువారం నిర్వహించిన భారీ బహిరంగ సభకు హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హెలిప్యాడ్ వద్ద…

2 days ago