జాయింట్ లేబర్ కమిషనర్ (జే సి ఎల్) సమక్షంలో యాజమాన్యం యూనియన్ మద్య ఒప్పందం
కార్మికుల సమస్యల పరిష్కారానికి యజమాన్యం అంగీకారం
బిస్లరీ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులు సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు:
పాశమైలారం పారిశ్రామిక అవాడ లోని బిస్లరీ ఇంటర్నేషనల్ పరిశ్రమలో గత 71 రోజులుగా పట్టుదలతో సమ్మెలో సమశీలంగా యజమాన్యం దిగొచ్చింది. 71 రోజుల సమ్మె ఫలితంగా జాయింట్ లేబర్ కమిషనర్ (జే సి ఎల్) సమక్షంలో యాజమాన్యం, యూనియన్ మద్య ఒప్పందం జరిగినట్లు,కార్మికుల సమస్యల పరిష్కారానికి యజమాన్యం అంగీకరించిందని,పోరాడిన కార్మికులకు జేజేలు అని బిస్లరీ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులు సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్ అన్నారు. గురువారం జాయింట్ లేబర్ కమిషనర్ (జేసిఎల్) శ్యాంసుందర్ రెడ్డి సమక్షంలో జరిగిన చర్చలో యాజమాన్యం ప్రతినిధులు ఏజీఎం హెచ్ఆర్ జి.సురేష్ మరియు ప్రొడక్షన్ సప్లై చైన్ శ్రీ హర్ష, హెచ్ఆర్ మేనేజర్ శ్రీనివాస్ రెడ్డి యూనియన్ ప్రతినిధులు యూనియన్ అధ్యక్షులు అతిమేల మానిక్ జనరల్ సెక్రెటరీ శేఖర్ రెడ్డి మరియు ఇన్స్టిట్యూట్ కమిటీ సభ్యులు చర్చల్లో పాల్గొన్నారని పాల్గొన్నారు. ఎటువంటి కండిషన్ లేకుండా యాజమాన్యం డ్యూటీలోకి తీసుకుంటామని, కార్మికుల షోకాజ్ చార్జిషీట్లను రద్దు చేయడంతో పాటు, కార్మికుల పైన పెట్టిన కేసులను తొలగిస్తామని, కార్మికుల సమస్యలను యూనియన్ తో చర్చించి పరిష్కరించడం జరుగుతుందని కార్మికులను ఎటువంటి కక్ష సాధింపు చర్యలు చేపట్టబోమని, పారిశ్రామిక ప్రశాంతత నెలకొల్పుతామని, ఒప్పందం కుదరడంతో సమ్మెను విరమించాలని కార్మికులు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.ఐదు మంది కార్మికుల విషయంలో ఏకాభిప్రాయం రాలేదని, తొలగించిన కార్మికులను తిరిగి పాత సర్వీసులో తీసుకొని హెచ్ఎండిఏ పరిధిలో ట్రాన్స్ఫర్ చేయడానికి యాజమాన్యం ముందుకు వచ్చిందని, కానీ కార్మికులు అంగీకరించలేదన్నారు. సమస్యను కోర్టులో తెలుసుకుంటామని కార్మికులు అంగీకరించారు. 71 రోజులుగా సుదీర్ఘంగా కార్మికులు ఐక్యంగా పట్టుదలతో సమ్మె చేశారని, వివిధ రూపాల్లో సమరశీలంగా పోరాటాలు నిర్వహించడం జరిగిందన్నారు. కలెక్టరేట్ లేబర్ కమిషన్ కార్యాలయం ముట్టడించడం జరిగిందని, సిఐటియు రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీ అండగా నిలిచిందన్నారు. రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు, రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లికార్జున్ జిల్లా అధ్యక్షులు బి మల్లేష్, కార్మికుల పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొని మద్దతు ఇవ్వటం జరిగిందని తెలిపారు. శాండ్విక్, కిర్బీ, సిబిఎల్ పార్లే, కోహేన్ ఎనర్జీ వివిధ సిఐటియు యూనియన్లు సంఘీభావంగా సహాయ సహకారాలు అందిస్తూ ప్రత్యక్షంగా పోరాటంలో పాల్గొన్నారని వారందరికీ, మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికి బిస్లరీ యూనియన్ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ చర్చల్లో యూనియన్ నాయకులు ప్రవీణ్ గౌడ్, సతీష్ గౌడ్, కృష్ణ కుమార్, శ్రీకాంత్, అమిత్, బసంత్, నాగరాజు, నవీన్, అజయ్ తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…