గ్రామపంచాయతీ కార్మికుల సమస్యల సాధన కోసం ఈ నెల 27న చలో సంగారెడ్డి కలెక్టరేట్ ను జయప్రదం చేయండి_సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు నాగేశ్వరరావు

politics Telangana

 

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

గ్రామ పంచాయతీ కార్మికుల సమ్మె డిమాండ్ల సాధన కోసం ఈ నెల 27న తలపెట్టిన చలో సంగారెడ్డి కలెక్టరేట్ ను విజయవంతం చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. చలో కలెక్టరేట్ జయప్రదం చేయాలని సోమవారం పట్టణంలోని శ్రామిక భవన్ లో ఆ సంఘం నాయకులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. గ్రామపంచాయతీ కార్మికుల సమస్యల సాధన కోసం గత 19 రోజులుగా సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వంలో చలనం లేకుండా పోయిందన్నారు. గ్రామపంచాయతీలలో పారిశుద్ధ్య కార్మికులతో పాటు బిల్ కలెక్టర్లు, కారోబార్, డ్రైవర్ లు గా వివిధ పనుల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. బిల్ కలెక్టర్,కారోబార్లకు కనీస వేతనం 19600 రూపాయలు,పారిశుద్ధ్య కార్మికులకు కనీస వేతనం 16600 రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు.అర్హులైన వారిని జూనియర్ పంచాయతీ కార్యదర్శులుగా పదోన్నతులు కల్పించాలన్నారు.పటాన్ చెరు మండలంలోని రుద్రారo, భానూర్, ఇంద్రేశం గ్రామాల్లో గత 3నెలలుగా జీతాలు చెల్లించక పోవడంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.జిన్నారం, అమీన్ పూర్,గుమ్మదిదల మండలాల్లో కూడా జీతాలు పెండింగులో వున్నాయని అన్నారు.సబ్బులు,నూనెలు,టవల్స్,చెప్పులు సమయానికి ఇవ్వడం లేదని వాపోయారు. అదేవిధంగా యూనిఫాం లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.సమ్మె ను నీరు కార్చ డానికి పంచాయతీ కార్యదర్శులు,ఎం పి డి వో లు కార్మికులను బయపెట్టిస్తున్నరని ఆరోపించారు.సమ్మెలోకి వెళ్తున్నామని సమ్మె నోటీసు ఇచ్చిన తర్వాత అధికారులు ఇలాంటి చర్యలకు పాల్పడితే సహించేది లేదన్నారు.తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఈనెల 27 న జరిగే చలో కలెక్టరేట్ ను జయప్రదం చేయాలని సందర్భంగా నాగేశ్వరరావు పిలుపునిచ్చారు ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలోబిక్షపతి,వేణు,జంగయ్య,శ్రీనివాస్,రాజు,మల్లేశ్, మానయ్య లు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *