Categories: politics

దేశం మరువని దార్శనికుడు జవహర్ లాల్ నెహ్రూ_నీలం మధు ముదిరాజ్

_నేటి బాలలే రేపటి భవిష్యత్తు అని నమ్మిన మహనీయుడాయన 

_రేవంత్ రెడ్డి నాయకత్వంలో అభివృద్ధి పథంలో తెలంగాణ..

_26 రోజులపాటు రాష్ట్రంలో ప్రజాపాలన విజయోత్సవాలు..

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

భారతదేశ తొలి ప్రధానిగా, రాజనీతిజ్ఞుడుగా దేశ అభివృద్ధికి పునాదివేసిన దేశం మరువని దార్శనికుడు పండిట్ జవహర్ లాల్ నెహ్రూ అని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు.పండిత్ నెహ్రూ జయంతిని పురస్కరించుకొని గురువారం చిట్కుల్లోని నీలం మధు క్యాంప్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రిటిష్ పాలకుల కబంధ హస్తాల నుంచి విముక్తి కలిగిన భారత దేశ తొలి ప్రధానిగా దేశాన్ని అన్ని రంగాల్లో మహోజ్వల ప్రగతి సాధించేలా పాలన కొనసాగించారన్నారు. పంచవర్ష ప్రణాళికలను రూపొందించి ఆధునిక భారతం అభివృద్ధిలో దూసుకుపోయే విధంగా కృషి చేశారని కొనియాడారు.నేటి బాలలే రేపటి భవిష్యత్తు అని నమ్మిన నెహ్రూ ను చిన్నారులంతా ముద్దుగా చాచా నెహ్రు అని సంబోధిస్తారని ఆ మహానేత జన్మదినాన్ని బాలల దినోత్సవం గా జరుపుకుంటున్నామని తెలిపారు. ఆ మహనీయుడు నెహ్రూ స్ఫూర్తితో తెలంగాణలో ప్రజా పాలన కొనసాగుతుందన్నారు. గత పాలకుల నిర్లక్ష్యంతో నిర్వీర్యమైన రంగాలను ముఖ్యమంత్రి రేవంత్ నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా పాలనలో మళ్లీ అభివృద్ధి బాటలో పయనిస్తున్నాయన్నారు. ఏడాదిలో జరిగిన అభివృద్ధిని ప్రజాక్షేత్రంలో తెలియజేయడానికి నెహ్రు జయంతి నుంచి 26 రోజులపాటు ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజా పాలన దినోత్సవం లో భాగంగా ప్రతి కాంగ్రెస్ పార్టీ సైనికుడు ఎన్ఎంఆర్ యువసేన సభ్యులు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని స్పష్టంగా వివరిస్తూ విరివిగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.

admin

Recent Posts

ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ లైవ్ కాన్సర్ట్‌కు ఏప్రిల్ 26న బౌల్డర్ హిల్స్‌లో

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…

22 hours ago

సమానత్వం కోసం పోరాడిన తత్వవేత్త జ్యోతిరావు పూలే

ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం  నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…

23 hours ago

ఘనంగా కేఎస్ పీపీ 4వ స్నాతకోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…

2 days ago

క్రీడలు నిత్య జీవితంలో భాగం కావాలి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…

2 days ago

గుమ్మడిదల రైతులకు న్యాయం చేయండి

భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…

3 days ago

· కాలుష్యం మాకు.. రోగాలు మాకూ.. అభివృద్ధి మీకా

సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల  సిఎస్ఆర్ నిధులు స్థానిక…

3 days ago