భూమి మీద పెట్టుబ‌డి పెడితే మంచి లాభాలు అర్జించ‌వ‌చ్చు – సినీ సోని చ‌రిష్ఠా

Districts politics Telangana

_సొంతింటి క‌ల‌ను నిజం చేసుకునేందుకు ఇదే మంచి అవ‌కాశం

మనవార్తలు,రామ‌చంద్రాపురం:

భూమి మీద పెట్టుబ‌డి పెడితే మంచి లాభాలు అర్జించ‌వ‌చ్చు అని సినీ న‌టి సోనీ చ‌రిస్ఠా అన్నారు. హైద‌రాబాద్ రామ‌చంద్రాపురంలో భార‌త్ నిర్మాణ్ సంస్థ తీసుకువ‌చ్చిన నేచ‌ర్ వ్యాలీ ప్రాజెక్ట్ బ్రోచ‌ర్ ను సంస్థ ప్ర‌తినిధుల‌తో క‌లిసిఆమె ఆవిష్క‌రించారు. నారాయ‌ణ్ ఖేడ్ లో 250 ఎక‌రాల్లో మెగా ఫాం ల్యాండ్ వెంచ‌ర్ తీసుకువ‌చ్చామ‌ని భార‌త్ నిర్మాణ సంస్థ ఛైర్మ‌న్ గ‌ణ‌ప‌తి రెడ్డి తెలిపారు.ఇప్ప‌టికే నాలుగు ప్రాజెక్ట్ లు పూర్తి చేశామ‌ని , ఐదో ప్రాజెక్ట్ ఆగ్రో ఫారెస్ట్రీ ఫాంల్యాండ్ అందుబాటులోకి తీసుకువ‌చ్చామ‌న్నారు.

ద‌క్షిణ భార‌త‌దేశంలోనే మొట్ట‌మొద‌టి సారిగా ఆగ్రో ఫారెస్ట్రీఫాం ల్యాండ్ ప్రాజెక్ట్ ను తీసుకువ‌చ్చిన‌ట్లు డైరెక్ట‌ర్ బాల‌కృష్ణం రాజు తెలిపారు.భార‌త్ నిర్మాణ సంస్థ‌ నారాయ‌ణ్ ఖేడ్ 250 ఎకారాల్లో నేచ‌ర్ వ్యాలీ ప్రాజెక్ట్ హిల్ లోకేష‌న్ లో ల‌భించింద‌న్నారు. దీర్ఘ కాలిక పెట్టుబ‌డులు పెట్టేందుకు నేచ‌ర్ వ్యాలీ ఫాం ల్యాండ్ ప్రాజెక్ట్ బెస్ట్ ఆఫ్ష‌న్ అని బాల‌కృష్ణం రాజు తెలిపారు. ఈ ఫాం ల్యాండ్ లో రెడ్ శాండిల్, మ‌ల‌బార్ ,నీమ్, ఆగ‌ర్ వుడ్ మొక్క‌లు సైతం పెంచేలా ఈ ప్రాజెక్ట్ ను రూప‌క‌ల్ప‌న చేశామ‌న్నారు. ప్ర‌తి ఫ్లాట్ కు జియో ట్యాగ్ ను ఏర్పాటు చేస్తున్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. ఈ ప్రాజెక్ట్ కు ఎంట్రీ ఆర్చ్, గెటెడ్ క‌మ్యూనిటీ ఫాం ల్యాండ్ రిసార్ట్, 33 అడుగుల రోడ్ , విద్యుత్,నీరు, 24 గంట‌ల సెక్యూరిటీ క‌ల్పిస్తున్న‌ట్లు బాల‌కృష్ణం రాజు తెలిపారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *