– గీతం అంతర్జాతీయ సదస్సు ముగింపు ఉత్సవంలో కేయూ డీన్ ప్రొఫెసర్ మల్లారెడ్డి
మనవార్తలు ,పటాన్ చెరు:
సాంకేతికత పురోగమిస్తున్న కొద్దీ అంతర్ విభాగ పరిశోధనలు , జ్ఞానానికి ప్రాముఖ్యం పెరిగిందని వరంగల్లోని కాకతీయ విశ్వవిద్యాలయం డీన్ ప్రొఫెసర్ మల్లారెడ్డి అన్నారు . గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో ‘ గణిత శాస్త్రాలు , సాంకేతిక పరిజ్ఞానంలో పెరుగుతున్న వినియోగం ‘ ( ‘ Mathematical Sciences and Emerging Applications in Technology ‘ ( ICMSEAT – 2022 ) అనే అంశంపై నిర్వహిస్తున్న మూడు రోజుల అంతర్జాతీయ సదస్సు ఆదివారంతో ముగిసింది . ఆంధ్రప్రదేశ్- తెలంగాణ గణితశాస్త్ర సంఘం ( ఏపీటీఎస్ఎంఎస్ ) సహకారంతో గీతం స్కూల్ ఆఫ్ సెన్స్ ని గణిత శాస్త్ర విభాగం నిర్వహిస్తున్న ఈ ముగింపు ఉత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ , విజయవంతంగా సదస్సును నిర్వహించిన నిర్వాహకులను అభినందించారు . అలాగే ఏపీటీఎస్ఎంఎస్ సేవలను , దాని వ్యవస్థాపకులను ఈ సందర్భంగా ఆయన స్మరించుకున్నారు .
గౌరవ అతిథిగా పాల్గొన్న ఏపీటీఎస్ఎంఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ ఎన్.కిషన్ మాట్లాడుతూ , సదస్యుల జ్ఞానాన్ని పెంపొందించి , వినూత్న ఆలోచనలను రేకెత్తించేలా ప్రముఖుల ఆతిథ్య ఉపన్యాసాలు ఈ మూడు రోజులపాటు కొనసాగాయన్నారు . ఈ సదస్సు పరిశోధక విద్యార్థులకు ఎంతగానో ఉపకరిస్తుందని ఏపీటీఎస్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ పి.జయసుబ్బారెడ్డి అభిప్రాయపడ్డారు . అధునాతన పరిశోధనలు , కొత్త విషయాలను తెలుసుకోవడానికి , కొంగొత్త స్నేహాలు ఏర్పడడానికి ఈ సదస్సు తోడ్పడినట్టు గీతం స్కూల్ ఆఫ్ సెన్ట్స్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ దత్తాత్రి కె.నగేశ వ్యాఖ్యానించారు . ఈ సదస్సును నిర్వహించేందుకు అవకాశమిచ్చిన ఏపీటీఎస్ఎంఎస్ కార్యవర్గానికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు . ఈ అంతర్జాతీయ సదస్సు నివేదికను కన్వీనర్ ప్రొఫెసర్ బీఎం నాయుడు సమర్పించగా , కార్యదర్శి డాక్టర్ పి.నారాయణస్వామి వందన సమర్పణ చేశారు . మరో నిర్వాహకుడు డాక్టర్ శివారెడ్డి శేరి , గణితశాస్త్ర విభాగాధిపతి డాక్టర్ ఎం . రాజా , డాక్టర్ డి.మల్లికార్జునరెడ్డి తదితరులు సదస్సు నిర్వహణలో తోడ్పడ్డారు .
ఇతర పరిశోధకులు ఏమి చేస్తున్నారో తెలుసుకోవడానికి , సందేహ నివృత్తికి , జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి ఈ సదస్సు దోహదపడినట్టు తమ ప్రతిస్పందన ( ఫీడ్ బ్యాక్ ) లో మిజోరాం ఎస్ఐటీ నుంచి వచ్చిన రాధ అభిప్రాయపడ్డారు . సదస్సును ప్రణాళికాబద్ధంగా , ఉపయుక్తంగా నిర్వహించి కొంగొత్త అంశాలు నేర్చుకోవడానికి వీలుకలిగినట్టు పిఠాపురం ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకుడు ఎం.శ్రీకుమార్ చెప్పారు . సదస్సులో పాల్గొన్న ప్రతి ఒక్కరితో పాటు పత్ర సమర్పణకు అధ్యక్షత వహించిన వారికి కూడా ప్రశంసా పత్రాలను అందజేశారు . ఏపీటీఎస్ఎంఎస్ కార్యనిర్వాహక సభ్యులతో పాటు ఇతర అతిథులను కూడా పుష్పగుచ్ఛాలు , దుశ్శాలువ , జ్ఞాపికలను ఇచ్చి సత్కరించారు .
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…