Telangana

పటాన్‌చెరులో ఎండిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రారంభమైన ఇండస్ట్రియల్ క్రికెట్ టోర్నమెంట్

_యువత క్రీడలపై ఆసక్తి పెంపొందించుకోవాలి

_ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

ప్రస్తుత పోటీ ప్రపంచంలో యువత చదువు, ఉద్యోగంతో పాటు క్రీడలపై ఆసక్తి పెంపొందించుకోవాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి కోరారు.ఎండిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పటాన్చెరువు పట్టణంలోని మైత్రి మైదానంలో ఏర్పాటు చేసిన ఇండస్ట్రియల్ క్రికెట్ టోర్నమెంట్ పోటీలను శనివారం ఉదయం పటాన్చెరు శాసనసభ్యులు జిఎంఆర్ లాంచనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలోని పరిశ్రమలలో పనిచేస్తున్న కార్మికుల కోసం క్రికెట్ పోటీలను ఏర్పాటు చేయడం పట్ల ఆయన నిర్వాహకులను అభినందించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ క్రీడా రంగానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించడంతోపాటు జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో రాణిస్తున్న క్రీడాకారులకు సంపూర్ణ సహకారాలు అందిస్తున్నారని తెలిపారు. పటాన్చెరు నియోజకవర్గంలో క్రీడారంగం అభివృద్ధికి కృషి చేయడంతో పాటు మూడు మినీ స్టేడియాలు నిర్మిస్తున్నామని తెలిపారు. ఏడాది పొడవునా వివిధ అంశాల్లో క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో పటాన్చెరు కార్పోరేటర్ మెట్టు కుమార్ యాదవ్, పటాన్చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయకుమార్, అమీన్పూర్ జడ్పిటిసి సుధాకర్ రెడ్డి, బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకట్ రెడ్డి, దశరథ రెడ్డి, మైత్రి క్లబ్ అధ్యక్షులు హనుమంత్ రెడ్డి, చంద్రశేఖర్, ఎం డి ఆర్ ఫౌండేషన్ గౌరవ అధ్యక్షులు పృథ్వీరాజ్, క్రీడాకారులు పాల్గొన్నారు.

admin

Recent Posts

ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ లైవ్ కాన్సర్ట్‌కు ఏప్రిల్ 26న బౌల్డర్ హిల్స్‌లో

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…

12 hours ago

సమానత్వం కోసం పోరాడిన తత్వవేత్త జ్యోతిరావు పూలే

ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం  నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…

13 hours ago

ఘనంగా కేఎస్ పీపీ 4వ స్నాతకోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…

1 day ago

క్రీడలు నిత్య జీవితంలో భాగం కావాలి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…

1 day ago

గుమ్మడిదల రైతులకు న్యాయం చేయండి

భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…

3 days ago

· కాలుష్యం మాకు.. రోగాలు మాకూ.. అభివృద్ధి మీకా

సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల  సిఎస్ఆర్ నిధులు స్థానిక…

3 days ago