2047 నాటికి భారతే నం.1: చంద్రబాబు

politics Telangana

_సమాజంలో మార్పులు తేవడానికి పబ్లిక్ పాలసీ శక్తివంతమైన ఆయుధం

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

కౌటిల్యా స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ తన తొలి పట్టాల ప్రదానోత్సవ వేడుకను ఆదివారం గీతం హెదరాబాద్ ప్రాంగణంలోని శివాజీ ఆడిటోరియంలో ఘనంగా జరుపుకుంది. సంప్రదాయ అకడమిక్ ప్రొసెషన్తో ప్రారంభమైన ఈ వేడుకలు జాతీయ గీతాలాపన, జ్యోతి ప్రజ్వలనతో శ్రీకారం చుట్టుకుంది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆంధ్రప్రదేశ్ పూర్వ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, తన మాటతో ఎవరు అంగీకరించి, లేకపోయినా, 2047 నాటికి భారతదేశం ,ఆర్థికంగా ప్రపంచంలోనే తొలి లేదా ద్వితీయ స్థానానికి చేరుకుంటుందని, భారతీయులు ప్రపంచమంతటా గొప్పవారు కాబోతున్నారని జోస్యం చెప్పారు. ఏదైనా సాధించాలనుకుంటే, దానిని దృశ్యమానం (నిజువలెజ్డ్) చేసుకుని, ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతూ, దానిని స్పష్టంగా అమలు చేయాలని ఆయన సూచించారు. తన దృష్టిలో 2047 కార్పొరేట్ గవర్నెన్స్, భారతీయులు ఆధిపత్యం చెలాయిస్తారని, పబ్లిక్ గవర్నెన్స్లో కూడా వారు ఆధిపత్యం వహించాలని ఆయన ఆకాంక్షించారు. మనను 75 ఏళ్లు పాలించిన బ్రిటన్ ప్రధానిని చూస్తే భారతీయుల బలం తేటతెల్లమవుతుందని హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. ప్రస్తుతం అమెరికా, ఐరోపాలలో మధ్యతరగతి ఆదాయం ఎక్కువగా ఉన్నవారు ఉన్నారని, భవిష్యత్తులో అది భారత్ వైపు మళ్లుతుందన్నారు.

ప్రస్తుతం 31 శాతంగా ఉన్న భారత మధ్య తరగతి 2030 నాటికి 60 శాతానికి పెరుగుతుందని ఆయన అంచనా వేశారు. పబ్లిక్ పాలసీని రూపొందించడానికి ఇదో సదవకాశంగా యువతకు ఆయన పిలుపునిచ్చారు. మన జనాభాకు సరెన విద్య, నెహ్రుణ్యాలను అలవచరగలిగితే అద్భుతాలు చేయవచ్చని, ప్రస్తుతం ప్రతియేటా 2.5 బిలియన్ల భారతీయులు ప్రపంచంలోని వివిధ దేశాలకు వలస వెళ్తున్నారని, ప్రపంచానికి శ్రామిక శక్తిని సరఫరా చేయగల సామర్థ్యం మనదేశానికి ఉందన్నారు. జనాభా నిర్వహణలో మనదేశం మరింత ముందుకు సాగితే, ప్రపంచంలో మనతో ఎవరూ పోటీపడలేరని, భవిష్యత్తు భారతేనని ఆయన చెప్పారు. యువత వల్లనే ఏదైనా సాధ్యమవుతుందని, కలలు కనాలి, వాటిని సాకారం చేసుకోవడానికి కష్టించాలన్నారు.

తాను హెదరాబాదు త్రిబుల్ సి ఫార్ములాతో అభివృద్ధి చేశానని, ఒక్క నయా పైసా వెచ్చించకుండా, ఎల్ అండ్ టీకి హెబైక్ సిటీ టవర్ నిర్మాణ బాధ్యతను కేవలం స్థలం ఇవ్వడం ద్వారా పబ్లిక్, ప్రైవేటు పార్టనర్షిస్ ఫార్ములాతో ప్రారంభించామని, 15 నుంచి 20 ఏళ్లలో ప్రభుత్వానికి మంచి ఆదాయం సమకూరుతోందన్నారు. ప్రస్తుతం తాను. ఫోర్ పీ ఫార్ములాను ప్రతిపాదిస్తున్నానని, ప్రజలు, ప్రభుత్వం, ప్రైవేటు పార్టనర్షిస్ ను ప్రతిపాదిస్తున్నట్టు చెప్పారు. ప్రజల భాగస్వామ్యంతో ఇది సాధ్యమని, పేద-ధనికుల మధ్య అంతరాన్ని కూడా నిర్మూలించవచ్చని చంద్రబాబు ధీమా వెలిబుచ్చారు. బిల్ గేట్స్ను ఒప్పించి మెక్రోసాఫ్ట్ను హెదరాబాద్కు తెచ్చానని, ఇక్కడే పనిచేసిన సత్యా నాదెండ్ల ప్రస్తుతం దాని అధ్యక్షుడయ్యాని సభికుల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ కాదన్నా, జీనోమ్ వ్యాలీని 1500 ఎకరాల్లో శ్రీకారం చుట్టామని, ప్రస్తుతం కరోనా వ్యాక్సిన్ అక్కడే ఉత్పత్తి అయిందన్నారు. కేఎస్పీపీ విద్యార్థి ప్రీతీష్ ఆనంద్కు ఆయన బంగారు పతకాన్ని బహుకరించారు.

గీతం అధ్యక్షుడు ఎం.శ్రీభరత్ తన అధ్యక్షోపన్యాసంలో పట్టభద్రులను అభినందించి, ముఖ్య అతిథి చంద్రబాబును సత్కరించారు. గీతం కులపతి ప్రొఫెసర్ వీరందర్ సింగ్ చౌహాన్ గ్రాడ్యుయేషన్ దినోత్సవాన్ని లాంఛనంగా ప్రారంభించినట్టు ప్రకటించారు.కేఎస్పీపీ విద్యార్థి సంయోగిత దిలీప్ సత్పుటే నేతృత్వంలో, గీతం ఉపకులపతి ప్రొఫెసర్ దయానంద సిద్ధవట్టం విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ముఖ్య అతిథి నుంచి పట్టాను అందుకున్న వారి పేర్లను గీతం అకడమిక్స్ ప్రో వెస్ట్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ జయశంకర్ ఇ.వరియార్ ప్రకటించారు. కాగా, గీతం రిజిస్ట్రార్ డి.గుణశేఖరన్ అధికారిక ధ్రువీకరణలపై కులపతి సంతకం తీసుకున్నారు.ఈ పట్టాల ప్రదానోత్సవంలో 43 మంది కేఎస్పీపీ విద్యార్థులు స్నాతకోత్తర (పీజీ) డిగ్రీలను అందుకున్నారు. తమ పిల్లలను వృత్తినిపుణులుగా తీర్చిదిద్దినందుకు తల్లిదండ్రులు కౌటిల్యా అధ్యాపక బృందానికి కృతజ్ఞతలు తెలియజేశారు. కేఎసీపీ విద్యార్థి వసీం అహ్మద్ విద్యార్థులందరి తరఫున తన స్పందనను తెలుపగా, కౌటిల్యా డీన్ సయ్యద్ అక్బరుద్దీన్ అమూల్య సందేశాన్ని ఇచ్చారు. చివరగా, కౌటిల్యా సహ వ్యవస్థాపకుడు ప్రతీక్ కున్వల్ వందన సమర్పణతో ఈ పట్టాల ప్రదానోత్సవం ముగిసింది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *