politics

భార‌త్ ప్ర‌పంచానికే ఆద‌ర్శంగా నిలిచింది – బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి

మనవార్తలు ,పటాన్ చెరు:

భార‌త్ అన్ని రంగాల్లో ప్ర‌పంచానికే ఆద‌ర్శంగా నిలిచింద‌ని బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి గ‌డీల శ్రీకాంత్ గౌడ్ అన్నారు.సంగారెడ్డి జిల్లా ప‌టాన్ చెరు నియోజ‌క‌వ‌ర్గంలోని ముత్తంగి గ్రామంలో బీజేపీ నేత‌లు ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఏనిమిదేళ్ళ సేవ, సుపరిపాలన గరీబ్ కళ్యాణ్ కార్యక్రమం నిర్వహించారు.ప్ర‌ధాని మోదీ చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాలు , పాల‌నా సంస్క‌ర‌ణ‌లు , కోవిద్ స‌మ‌యంలో మోడీ వ్య‌వ‌హ‌రించిన తీరు ప్ర‌పంచానికే ఆద‌ర్శంగా నిలిచింద‌న్నారు .

కులమతాలకు అతీతంగా అన్నివర్గాలు కలిసిమెలసి ఉంటూ దేశ ఖ్యాతిని ప్రపంచ దేశాలకు చాటిచెబుతున్నారని ఓబీసీ మోర్చ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడీల శ్రీకాంత్ గౌడ్ కొనియాడారు. వ్యాక్సిన్‌ తయారీకి అవసరమైన సౌకర్యాల కల్పనపై ప్రధాని ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకున్నారని పేర్కొన్నారు. ప్రధాని కృషితో అతిస్వల్ప కాలంలోనే దేశీయంగా కరోనా వ్యాక్సిన్‌ ఉత్పత్తి చేయడమేకాకుండా ప్రపంచ దేశాలకు సరఫరా చేయగలుగామ‌న్నారు . శాస్త్ర, సాంకేతిక, విద్యా, వైద్య రంగాల్లో మనదేశం ప్రపంచంలోనే ముందువరుసలో ఉందని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఇంఛార్జి జయశ్రీ, జిల్లా అధ్యక్షులు నరేందర్ రెడ్డి, ఓబీసీ మోర్చ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడీల శ్రీకాంత్ గౌడ్ గడప గడపకు వెళ్లి కరపత్రాలను అందించారు. మోడీ ఎనిమిదేళ్ళ పాలనలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు ఈశ్వరయ్య, ఓబీసీ మోర్చ రాష్ట్ర కార్యదర్శి దేవెందర్ గౌడ్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మహెందర్, కార్యదర్శి బైండ్ల కుమార్, ఉపాధ్యక్షులు బాబు రాజు, నాయకులు వీరారెడ్డి, పుణ్యవతి, పుష్పా, సాయి, నరెందర్, షకీల్, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

సమాజానికే సందేశం గాంధీజీ జీవన విధానం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…

7 days ago

మాతృభూమిపై మమకారాన్ని చాటే అపూర్వ అవకాశం వికసిత్ భారత్ రన్‌

మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…

2 weeks ago

కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు కొనసాగిస్తాం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…

2 weeks ago

గొప్ప గాంధేయవాది కొండా లక్ష్మణ్ బాపూజీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…

3 weeks ago

పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేవి సైన్స్ ఎగ్జిబిషన్ లు

- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…

3 weeks ago

వికలాంగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…

3 weeks ago