Telangana

పటాన్‌చెరులో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

జాతీయ జెండాను ఎగరవేసిన ఎమ్మెల్యే జిఎంఆర్

అందరి సహకారంతో అభివృద్ధిలో అగ్రగామిగా పటాన్చెరు

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

రాష్ట్ర ప్రభుత్వ సహకారం, ప్రజల తోడ్పాటుతో పటాన్చెరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకొని వెళ్తున్నామని స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. 79వ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకుని పటాన్చెరు డివిజన్ పరిధిలోని జిహెచ్ఎంసి కార్యాలయం, ఎంపీడీవో, ఎమ్మార్వో, మార్కెట్ కమిటీ, వివిధ సంక్షేమ సంఘాల కార్యాలయాలతో పాటు, మైత్రి మైదానంలో ఏర్పాటు చేసిన పంద్రాగస్టు వేడుకల్లో ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాలను ఎగురవేశారు. ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ మినీ ఇండియా గా పేరుందిన పటాన్‌చెరులో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తూ, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నామని తెలిపారు.

కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్యను అందించేలా పటాన్‌చెరులో ప్రాథమిక పాఠశాల నుండి పీజీ కళాశాల వరకు ఆంగ్లం, తెలుగు మాధ్యమాల్లో విద్యను అందించడం జరుగుతుందన్నారు. ఈ సంవత్సరం నుండి పాలిటెక్నిక్ కళాశాల సైతం విద్యార్థులకు అందుబాటులోకి వచ్చిందని తెలిపారు. పేద మధ్యతరగతి ప్రజలకు వైద్యం భారం కాకూడదన్న సమన్నత లక్ష్యంతో గత రెండు సంవత్సరాల క్రితం పటాన్‌చెరు పట్టణంలో శంకుస్థాపన చేసిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులు దాదాపు తుది దశకు చేరుకున్నాయని. అతి త్వరలో ప్రారంభించబోతున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను పూర్తి పారదర్శకతతో అందిస్తున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమాల్లో పటాన్‌చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, డిఎస్పి ప్రభాకర్, తహసిల్దార్ రంగారావు, ఎంపీడీవో యాదగిరి, ఎంఈఓ నాగేశ్వర నాయక్, జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ సురేష్, మాజీ జెడ్పిటిసి జైపాల్, గూడెం మధుసూదన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నరసింహారెడ్డి, పట్టణ పుర ప్రముఖులు, సీనియర్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

పరిశ్రమ సంసిద్ధతపై కార్యశాల

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…

2 days ago

నాణ్యమైన మౌలిక సదుపాయాలకు వెన్నెముకగా మెట్రాలజీ

గీతం ఆతిథ్య ఉపన్యాసంలో జాతీయ భౌతిక ప్రయోగశాల డైరెక్టర్ ప్రొఫెసర్ ఆచంట వేణుగోపాల్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఒక…

2 days ago

* భారతదేశంలోనే తొలి ‘సింగిల్-డే ఫేషియల్ ఆర్కిటెక్చర్’ సెంటర్

ప్రముఖ సినీనటి నివేతా పెతురాజ్ వి‌కేర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ప్రారంభించారు మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :…

3 days ago

గీతంలో సంక్రాంతి సంబరాలు

సంప్రదాయాల సాంస్కృతిక గొప్పతనాన్ని ప్రదర్శించిన విద్యార్థులు\\ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో గురువారం సంక్రాంతి…

3 days ago

సీనియర్ సిటిజన్స్‌కు ఎల్లప్పుడూ అండగా ఉంటాం కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి

భారతి నగర్ డివిజన్‌లో 2026 డైరీ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణలో కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి రామచంద్రాపురం ,మనవార్తలు…

4 days ago

కాంగ్రెస్ శ్రేణుల సమిష్టి కృషితోనే కాంగ్రెస్ అభ్యర్థుల విజయం : నీలం మధు ముదిరాజ్..

కేసీఆర్ కోటలో హస్తం హవా మెజార్టీ గ్రామాలలో కాంగ్రెస్ జయకేతనం గజ్వెల్ నియోజకవర్గ కాంగ్రెస్ సర్పంచ్ లకు ఘన సన్మానం…

4 days ago