మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు:
రానున్న స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని మైత్రి మైదానంలో అంగరంగ వైభవంగా పంద్రాగస్టు వేడుకలు నిర్వహిస్తున్నట్లు పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. మంగళవారం సాయంత్రం పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని మండల విద్యాశాఖ అధికారులు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులతో వేడుకలపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రతి ఏటా మాదిరిగానే సంస్కృతిక కార్యక్రమాలు, మార్చ్ ఫాస్ట్, తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు కార్యక్రమాలలో పాల్గొనేలా చూడాలని అధికారులను ఆదేశించారు. సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనే ప్రతి పాఠశాలకు ఐదు వేల రూపాయల నగదు బహుమతి తో పాటు, ప్రథమ ద్వితీయ తృతీయ స్థానాలు సాధించిన పాఠశాలలకు 20 వేలు, 15 వేలు, 10 వేల రూపాయలు అందించనున్నట్లు తెలిపారు. దేశ స్వాతంత్ర ఘట్టాలను, సంస్కృతిని మరిపించేలా కార్యక్రమాలు రూపొందించాలని సూచించారు.
భక్తుల సౌకర్యార్థం సొంత నిధులతో రోడ్డు నిర్మాణం ఐదు లక్షల రూపాయలు అందజేత విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో అన్నదానం భక్తులకు…
విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో అన్నదానం భక్తులకు స్వయంగా అన్నప్రసాదం వడ్డించిన కాట శ్రీనివాస్ గౌడ్ దంపతులు మనవార్తలు ప్రతినిధి ,పటాన్…
మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ సైన్స్, పర్యావరణ శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థిని ఎం.…
-పరమేష్ యాదవ్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ -ఈఎస్ఐ ఆస్పత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : పటాన్‌చెరు…
-ఐలేష్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ -ఈఎస్ఐ ఆస్పత్రిలో రోగులకు పండ్ల పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం…
ఎమ్మెల్యే జన్మదినానికి అభిమానుల వినూత్న కానుక అభిమానానికి ప్రతి రూపంగా ప్రత్యేక బహుమతి అందించిన బిఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకుడు…