Telangana

ఆగస్టు 19న పటాన్‌చెరు యాదవ సంఘం ఫంక్షన్ హాల్ ప్రారంభోత్సవం

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు:

పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని గోకుల్ నగర్ లో నాలుగు కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించిన యాదవ సంఘం కళ్యాణ మండపాన్ని ఆగస్టు 19న ప్రారంభించబోతున్నట్లు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. సోమవారం ఉదయం మాజీ ప్రజా ప్రతినిధులు, యాదవ సంఘం ప్రతినిధులు, బల్దియా ఇంజనీరింగ్ అధికారులతో కలిసి ఫంక్షన్ హాల్ ను పరిశీలించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పేద, మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఫంక్షన్ హాళ్లు నిర్మించాలన్న లక్ష్యంతో నియోజకవర్గం వ్యాప్తంగా కళ్యాణ మండపాలు నిర్మిస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా పటాన్‌చెరు పట్టణంలోని యాదవుల కోసం ఆధునిక హంగులతో, పూర్తి సౌకర్యాలతో కళ్యాణ మండపాన్ని నిర్మించినట్లు తెలిపారు. అందరి అభిప్రాయాలకు అనుగుణంగా ఆగస్టు 19న కళ్యాణ మండపాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు శంకర్ యాదవ్, సపానదేవ్, మెట్టు కుమార్ యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, డిఈ కృష్ణవేణి, యాదవ సంఘం అధ్యక్షులు దేవయ్య యాదవ్, వైస్ ప్రెసిడెంట్ మల్లేష్ యాదవ్, శ్రీశైలం యాదవ్, యాదగిరి యాదవ్, సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.

admin

Recent Posts

నందిగామ సర్పంచ్ విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో రుద్రారం గణేష్ గడ్డ వరకు పాదయాత్ర

భక్తుల సౌకర్యార్థం సొంత నిధులతో రోడ్డు నిర్మాణం ఐదు లక్షల రూపాయలు అందజేత విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో అన్నదానం  భక్తులకు…

2 hours ago

రుద్రారం శ్రీ గణేష్ దేవస్థానంలో వైభవంగా బ్రహ్మోత్సవాలు

విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో అన్నదానం భక్తులకు స్వయంగా అన్నప్రసాదం వడ్డించిన కాట శ్రీనివాస్ గౌడ్ దంపతులు మనవార్తలు ప్రతినిధి ,పటాన్…

3 hours ago

పర్యావరణ శాస్త్రంలో కెజియా ఎలిజబెత్ కు పీహెచ్.డీ

మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ సైన్స్, పర్యావరణ శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థిని ఎం.…

8 hours ago

సేవా కార్యక్రమాలతో జీఎంఆర్ జన్మదిన వేడుకలు

-పరమేష్ యాదవ్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ -ఈఎస్ఐ ఆస్పత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : పటాన్‌చెరు…

21 hours ago

రామచంద్రాపురంలో ఘనంగా ఎమ్మెల్యే జిఎంఆర్ జన్మదిన వేడుకలు

-ఐలేష్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ -ఈఎస్ఐ ఆస్పత్రిలో రోగులకు పండ్ల పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం…

21 hours ago

పూరి బీచ్‌పై మెరిసిన ఎమ్మెల్యే జిఎంఆర్ సైకత శిల్పం

ఎమ్మెల్యే జన్మదినానికి అభిమానుల వినూత్న కానుక అభిమానానికి ప్రతి రూపంగా ప్రత్యేక బహుమతి అందించిన బిఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకుడు…

21 hours ago