_అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కంకణబద్దులు కావాలి
_ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
అమీన్పూర్,మనవార్తలు ప్రతినిధి :
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనలు, ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరు కంకణబద్దులు కావాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 132వ జయంతిని పురస్కరించుకుని అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని ఆనంద్ నగర్ కాలనీ , అమీన్పూర్ మండల పరిధిలోని ఐలాపూర్ గ్రామాలలో ఏర్పాటుచేసిన అంబేద్కర్ విగ్రహాలను స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రజలు, దళిత సంఘాల ప్రతినిధుల సమక్షంలో ఎమ్మెల్యే జిఎంఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ.. తన జీవితాంతం బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి అంబేద్కర్ కృషి చేశారని తెలిపారు. కార్మికులకు కనీస వేతనాలు, సమాన హక్కులు, పరిపాలన వికేంద్రీకరణ, చిన్న రాష్ట్రాలు, పరిపాలనలో మహిళలకు 50% రిజర్వేషన్లు, తదితర మహోన్నత నిర్ణయాలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారానే తీసుకోవడం జరిగిందని తెలిపారు. ఆయన స్ఫూర్తిని భవిష్యత్తు తరాలకు అందించాలన్న లక్ష్యంతో.. నియోజకవర్గ వ్యాప్తంగా ఆయన విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమాల్లో ఎంపీపీ దేవానందం, మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, వైస్ ఎంపీపీ సునీత సత్యనారాయణ, ఐలాపూర్ గ్రామ సర్పంచ్ మల్లేష్, కౌన్సిలర్లు, కో ఆప్షన్ l సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, దళిత సంఘాల ప్రతినిధులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…