మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు:
ప్రభుత్వం చేపడుతున్న అక్రమ భూ సేకరణ పనులను వెంటనే నిలిపివేయాలని సిపిఎం పార్టీ డివిజన్ కార్యదర్శి బి నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం పటాన్ చెరు మండలంలోని లక్డారం గ్రామంలో రైతులతో భూ సమస్య పైన కలిసి మాట్లాడడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూసర్వే నెంబర్ 498లో 22 ఎకరాల భూమిలో రెవెన్యూ వారి సహకారంతో పోలీసు యంత్రాంగం దౌర్జన్యంగా చేస్తున్న అక్రమ భూ సేకరణ పనులను వెంటనే నిలిపివేయాలని సిపిఎం పార్టీ డివిజన్ కార్యదర్శి బి నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. గ్రామ రైతులకు 1970లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 25 మంది రైతులకు ఎక్కరా చొప్పున భూమి కేటాయించిందని గుర్తు చేశారు. ఎస్టిపి ప్లాంటు ఏర్పాటలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం 10 ఎకరాలను కేటాయిస్తున్నామని చెప్పి, ఫెన్సింగ్ వేయడం ఎంతవరకు సమంజసమన్నారు. గ్రామంలో ఎస్ టి పి ప్లాంటు ఏర్పాటు కోసం భూసేకరణ కోసం ఎ లాంటి నోటీసులు ఇవ్వకుండా, గ్రామసభ నిర్వహించకుండా, ఏ రకంగా భూమిలో ఫెన్సింగ్ వేస్తున్నారని ప్రశ్నించారు. రైతుల భూముల వద్ద వందలాది మంది పోలీసులతో ఫెన్సింగ్ వేయించడం, రైతులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. గ్రామ రైతుల విషయంలో ఇప్పటికే హైకోర్టులో కొనసాగుతుందని, ఈనెల 20వ తేదీన విచారణ ఉన్నదన్నారు. 2013 భూ సేకరణ చట్టం ప్రకారము రైతుల వద్ద ప్రభుత్వ అవసరాల కోసం భూమి తీసుకుంటే భూమికి భూమి లేదా, నోటీసులు ఇచ్చి గ్రామసభ నిర్వహించి నష్టపరిహారం కోసం చర్చించవలసి ఉన్న, జిల్లా రెవెన్యూ యంత్రాంగం ఇలాంటి చర్యలు చేపట్టలేదని మండిపడ్డారు. అందుకోసం లక్డారం గ్రామ దళితుల భూ సమస్య పరిష్కారం కోసం రాజకీయ పార్టీలను, దళిత ప్రజా సంఘాలను పెద్ద ఎత్తున సమీకరించి గ్రామ రైతులకు న్యాయం జరిగేంత వరకు ఆందోళన చేస్తామని హెచ్చరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ రైతులు కే మల్లేష్, మాణిక్ ప్రభు, లక్ష్మయ్య, బలరాం, జీవన్ కుమార్, రవి, శ్రీనివాస్, వెంకటమ్మ, నవనీత, అంతమ్మ తదితర రైతులు పాల్గొన్నారు.
