Telangana

నైపుణ్యం ఉంటే గరిష్ఠ వేతనంతో ఉద్యోగం పొందొచ్చు

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

ఆకర్షణీయమైన ప్యాకేజీలతో నుంచి ఉద్యోగాలను పొందాలంటే అందుకు అవసరమైన నెఫుణ్యాలను అలవరచుకోవడం అవశ్యమని గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అసోసియేట్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎన్. సీతారామయ్య స్పష్టీకరించారు. గీతం కెరీర్ గైడెన్స్ సెంటర్ (జీసీజీసీ) ఆధ్వర్యంలో ‘స్కిల్ బిల్డింగ్ అండ్ కెరీర్ ఫుల్ఫిల్మెంట్’ అనే అంశంపై సోమవారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఆరో సెమిస్టర్లో ఉన్న విద్యార్థులకు శిక్షణ కార్యక్రమం ఫిబ్రవరిలో ప్రారంభమవుతుందని, అన్ని శిక్షణా తరగతులకు విద్యార్థులంతా క్రమం తప్పకుండా హాజరు కావాలని కోరారు. వచ్చే ఏడాది వంద శాతం ప్రాంగణ నియామకాలు సాధించాలనే లక్ష్యంతో తాము ముందుకు సాగుతున్నట్టు చెప్పారు. ఉన్నత చదువులైనా , లేదా ప్రాంగణ నియామకాలైనా , విద్యార్థులకు ఇష్టమైనై కెరీర్ మార్గాన్ని ఓ స్పష్టతతో ఎంపిక చేసుకుని, అందుకు అనుగుణంగా లక్ష్యాలను నిర్దేశించుకుంటూ ముందుకు సాగాలని సీజీసీ హెదరాబాద్ డైరెక్టర్ డాక్టర్ నాతి వేణుకుమార్ స్పష్టీకరించారు. విద్యార్థి అభిరుచికి అనుగుణంగా తగు మార్గదర్శనం చేసే సిబ్బంది కెరీర్ గైడెన్స్ కేంద్రంలో అందుబాటులో ఉంటారని చెబుతూ, తమ విభాగం నిర్మాణం, బాధ్యతలను వివరించారు.

ఈ ఏడాది ఇప్పటివరకు 66 కంపెనీలు గీతంలో ప్రాంగణ నియామకాలు చేపట్టగా, కేవలం 50 శాతం మంది విద్యార్థులు మాత్రమే ఎంపికయ్యారని, గరిష్ట వార్షిక వేతనాలు ఇవ్వజూపిన దాదాపు పది-పన్నెండు కంపెనీలకు ఒక్కరు కూడా ఎంపిక కాలేదని ఆయన విచారం వెలిబుచ్చారు. పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా మెరుగైన నైపుణ్యాలను అలవరచుకోవాలని సూచించారు. ప్రతి సెమిస్టర్ లో 30 గంటల కెరీర్ గైడెన్స్ శిక్షణ ఉంటుందని, దీనికి అదనంగా 6, 7 సెమిస్టర్లలో 30 గంటల ప్రత్యేక శిక్షణ ఇచ్చి, ప్రతిభకనబరచిన 600 నుందిని ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలు, మిగిలిన వారు సర్వీస్ బేస్డ్ కంపెనీలలో ఉద్యోగాలు పొందేలా తర్ఫీదు ఇస్తామని డిప్యూటీ డైరెక్టర్ (నెపుణ్యాభివృద్ధి) డాక్టర్ సురేష్, వివరించారు. ఏయే మాడ్యూల్లో ఎటువంటి శిక్షణ ఇస్తారో ఆయన విడమరిచి చెప్పారు.
గీతం వెబ్ సైట్ ద్వారా ప్రాంగణ నియామకాల కోసం పేర్లు నమోదు చేసుకోవడం, ఆన్‌లైన్‌లో రుసుము చెల్లించే విధానాలను శిక్షణాధికారి బి. సంతోష్ కుమార్ తెలియజేశారు.

admin

Recent Posts

ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ లైవ్ కాన్సర్ట్‌కు ఏప్రిల్ 26న బౌల్డర్ హిల్స్‌లో

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…

1 day ago

సమానత్వం కోసం పోరాడిన తత్వవేత్త జ్యోతిరావు పూలే

ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం  నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…

1 day ago

ఘనంగా కేఎస్ పీపీ 4వ స్నాతకోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…

2 days ago

క్రీడలు నిత్య జీవితంలో భాగం కావాలి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…

2 days ago

గుమ్మడిదల రైతులకు న్యాయం చేయండి

భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…

4 days ago

· కాలుష్యం మాకు.. రోగాలు మాకూ.. అభివృద్ధి మీకా

సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల  సిఎస్ఆర్ నిధులు స్థానిక…

4 days ago