Telangana

మున్సిపల్ అభివృద్ధిపై దమ్ముంటే చర్చకు రావాలి

– మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జైపాల్ రెడ్డి

– బీఆర్ఎస్ నాయకులకు కాంగ్రెస్ నాయకుల ఓపెన్ సవాల్

బొల్లారం ,మనవార్తలు ప్రతినిధి :

బొల్లారం అభివృద్ధిపై బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలను ఖండిస్తూ నేడు చర్చకు సిద్ధమేనా అంటూ బొల్లారం మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జైపాల్ రెడ్డి గారు ఓపెన్ సవాల్ విసిరారు. శనివారం బొల్లారంలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, నాయకులతో కలిసి మీడియా సమావేశం లో మాట్లాడుతూ బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలను బొల్లారం మున్సిపల్ కాంగ్రెస్ నాయకులు తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. మున్సిపాలిటీలో హరితహారం మొక్కలు ఎక్కడ నాటారని ప్రశ్నించారు. ఎంతమందికి పెన్షన్లు, రేషన్ కార్డులు అందించారని చెప్పాలని డిమాండ్ చేశారు. మున్సిపాలిటీలో జరుగుతున్న రోడ్ల నిర్మాణ పనులు కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే జరుగుతున్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారం కోల్పోయి సంవత్సరం గడిచిన స్థానిక బిఆర్ఎస్ నాయకులు అదే భ్రమలో ఉన్నారని ఎద్దేవా చేశారు.

ప్రజలు అన్ని గమనిస్తున్నారని తెలుసుకోవాలన్నారు. అధికారం కోసమే రాజకీయాలు చేసే నాయకులని మండిపడ్డారు. అందుకోసం అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలో మారడం స్థానిక నాయకులకు అలవాటేనన్నారు. ఇక మీ పప్పులు ఉడకవని హెచ్చరించారు. మూడో వార్డులో ఎక్కడ అభివృద్ధి జరిగిందో చెప్పాలని కౌన్సిలర్ను డిమాండ్ చేశారు. మున్సిపల్ అభివృద్ధిపై దమ్ముంటే రేపు ఉదయం తొమ్మిది గంటలకు పాత మున్సిపల్ కార్యాలయం ఎదుట గాంధీ చౌరస్తాలో చర్చకు రావాలని బీఆర్ఎస్ నాయకులకు సవాల్ విసిరారు. పాలకవర్గం అవలంబిస్తున్న తీరుపై ప్రజలు సరైన బుద్ధి చెబుతారని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు గోపాలమ్మ గారు, చంద్రయ్య గారు, నర్సింహారాజు గారు, నాయకులు లక్ష్మా రెడ్డి గారు, సంపత్ రెడ్డి గారు, శ్రీధర్ రెడ్డి గారు, మాజీ ఎంపీటీసీ రాజు గారు, రాజ్ గోపాల్ గారు, చంద్రారెడ్డి గారు, మాజీ వార్డ్ మెంబర్ భాస్కర్ గారు, చక్రపాణి గారు, రవీందర్ రెడ్డి గారు, శేఖర్ గారు, యువజన నాయకులు అబ్దుల్ బషీర్ గారు, ఇమ్రాన్ గారు, ప్రవీణ్ గారు తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

పరిశ్రమ సంసిద్ధతపై కార్యశాల

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…

2 days ago

నాణ్యమైన మౌలిక సదుపాయాలకు వెన్నెముకగా మెట్రాలజీ

గీతం ఆతిథ్య ఉపన్యాసంలో జాతీయ భౌతిక ప్రయోగశాల డైరెక్టర్ ప్రొఫెసర్ ఆచంట వేణుగోపాల్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఒక…

2 days ago

* భారతదేశంలోనే తొలి ‘సింగిల్-డే ఫేషియల్ ఆర్కిటెక్చర్’ సెంటర్

ప్రముఖ సినీనటి నివేతా పెతురాజ్ వి‌కేర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ప్రారంభించారు మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :…

3 days ago

గీతంలో సంక్రాంతి సంబరాలు

సంప్రదాయాల సాంస్కృతిక గొప్పతనాన్ని ప్రదర్శించిన విద్యార్థులు\\ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో గురువారం సంక్రాంతి…

3 days ago

సీనియర్ సిటిజన్స్‌కు ఎల్లప్పుడూ అండగా ఉంటాం కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి

భారతి నగర్ డివిజన్‌లో 2026 డైరీ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణలో కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి రామచంద్రాపురం ,మనవార్తలు…

4 days ago

కాంగ్రెస్ శ్రేణుల సమిష్టి కృషితోనే కాంగ్రెస్ అభ్యర్థుల విజయం : నీలం మధు ముదిరాజ్..

కేసీఆర్ కోటలో హస్తం హవా మెజార్టీ గ్రామాలలో కాంగ్రెస్ జయకేతనం గజ్వెల్ నియోజకవర్గ కాంగ్రెస్ సర్పంచ్ లకు ఘన సన్మానం…

4 days ago