Hyderabad

ఆదర్శప్రాయుడు బాబు జగ్జీవన్ రామ్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్ చెరు

దేశంలో సమసమాజ స్థాపనకు కృషి చేసిన స్వాతంత్ర సమరయోధుడు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ నేటి తరానికి ఆదర్శప్రాయుడని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతిని పురస్కరించుకొని మంగళవారం పటాన్చెరు పట్టణంలోని ఆయన కాంస్య విగ్రహానికి ఎమ్మెల్యే జిఎంఆర్ , టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.

 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలందరూ బాపూజీ అని ప్రేమగా పిలుచుకునే బాబు జగ్జీవన్ రామ్ స్వాతంత్ర సంగ్రామం తో పాటు, తదనంతరం ఏర్పడిన ప్రభుత్వాలలో మంత్రిగా పనిచేసి ఉత్తమ పరిపాలనదక్షుడిగా ప్రజల మన్ననలు పొందారని తెలిపారు. ప్రధానంగా దేశంలోని షెడ్యూలు కులాలు, అనగారిన బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేశారని కొనియాడారు. నేటితరం యువతరానికి, ప్రజాప్రతినిధులకు జగ్జీవన్ రామ్ ఆదర్శప్రాయుడని అన్నారు.అనంతరం కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కెసిఆర్ గారు జగ్జీవన్ రామ్,అంబేద్కర్, పూలే లాంటి మహనీయులకు ప్రత్యేక గౌరవం ఇస్తు ప్రతి కార్పొరేషన్ పరిధిలో విగ్రహాలు ప్రతిష్టించారు అలాగే మన మహనీయులను విస్మరించకుండా వారికి ప్రత్యేకంగా ప్రతి ఒక్కరు ఘన నివాళి  అర్పించాలని  అన్నారు.
ఈ కార్యక్రమంలో పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అఫ్జల్, పార్టీ సీనియర్ నాయకులు దశరథ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, విజయ్ కుమార్, వెంకటేష్, పృథ్వి రాజ్, దళిత సంఘాల ప్రతినిధులు రుద్రారం శంకర్, డప్పు యాదయ్య, బాల మల్లేష్, శంకర్, యాదయ్య, సామయ్య, శంకరయ్య, టిఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Ramesh

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

9 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

9 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

9 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

9 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

9 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

9 hours ago