దేశంలో సమసమాజ స్థాపనకు కృషి చేసిన స్వాతంత్ర సమరయోధుడు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ నేటి తరానికి ఆదర్శప్రాయుడని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతిని పురస్కరించుకొని మంగళవారం పటాన్చెరు పట్టణంలోని ఆయన కాంస్య విగ్రహానికి ఎమ్మెల్యే జిఎంఆర్ , టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలందరూ బాపూజీ అని ప్రేమగా పిలుచుకునే బాబు జగ్జీవన్ రామ్ స్వాతంత్ర సంగ్రామం తో పాటు, తదనంతరం ఏర్పడిన ప్రభుత్వాలలో మంత్రిగా పనిచేసి ఉత్తమ పరిపాలనదక్షుడిగా ప్రజల మన్ననలు పొందారని తెలిపారు. ప్రధానంగా దేశంలోని షెడ్యూలు కులాలు, అనగారిన బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేశారని కొనియాడారు. నేటితరం యువతరానికి, ప్రజాప్రతినిధులకు జగ్జీవన్ రామ్ ఆదర్శప్రాయుడని అన్నారు.అనంతరం కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కెసిఆర్ గారు జగ్జీవన్ రామ్,అంబేద్కర్, పూలే లాంటి మహనీయులకు ప్రత్యేక గౌరవం ఇస్తు ప్రతి కార్పొరేషన్ పరిధిలో విగ్రహాలు ప్రతిష్టించారు అలాగే మన మహనీయులను విస్మరించకుండా వారికి ప్రత్యేకంగా ప్రతి ఒక్కరు ఘన నివాళి అర్పించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అఫ్జల్, పార్టీ సీనియర్ నాయకులు దశరథ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, విజయ్ కుమార్, వెంకటేష్, పృథ్వి రాజ్, దళిత సంఘాల ప్రతినిధులు రుద్రారం శంకర్, డప్పు యాదయ్య, బాల మల్లేష్, శంకర్, యాదయ్య, సామయ్య, శంకరయ్య, టిఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…
ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…
భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…
భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…
సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల సిఎస్ఆర్ నిధులు స్థానిక…