మనవార్తలు ,శేరిలింగంపల్లి:
తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు ప్రతి నెల రక్తం అవసరం ఉంటుందని ప్రతి ఒక్కరూ రక్త దానం చేయాలని విక్టరీ బాయ్స్ ప్రతినిధులు కొమ్ముగూరి ప్రదీప్ అన్నారు . రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి లో “మదర్ థెరిస్సా” రక్తదాన కేంద్రంలో విక్టరీ బాయ్స్ యువత రక్తదాన చేశారు . 73 వ గణతంత్ర దినోత్సవంను పురస్కరించుకుని ప్రతీ ఏడాదిలాగే ఈసారి కోవిడ్ నిబంధనలను పాటిస్తూ 8వ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు .
తలసేమియా ప్రాణాంతకర వ్యాధి అని ఎంతో మంది చిన్నారులు ఈ వ్యాధితో బాధపడుతున్నారని తెలిపారు. కరోనా సమయంలో రక్తదాతలు రక్తం ఇచ్చేందుకు ముందుకు రావడం లేదని ..దీంతో ఎంతో మంది చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు .రక్తదానం చేయడంపై ఉన్న అపోహలను తొలగించాల్సిన అవసరం ఉందన్నారు . యువత స్వచ్చంధంగా రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు . కోవిడ్ మహమ్మారి తో పోరాడుతూనే అలాగే ప్రభుత్వ నియమ నిబంధనలు పాటిస్తూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు . ఈ కార్యక్రమంలో కొమ్ముగూరి ప్రదీప్,పృద్వి రాజ్, జాక్సన్ ,అనిల్ మనీష్ బృందాన్ని రక్తదాన కేంద్ర సిబ్బంది ప్రత్యేకంగా అభినందించారు. రక్తదానం చేసిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ లోని గణిత శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థిని…
తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు:…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: సనాతన ధర్మాన్ని యావత్ ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయుడు స్వామి వివేకానంద అని పటాన్ చిరు…
స్వామి వివేకానంద 163వ జయంతి సందర్భంగా విజయవాడలో ఘన సన్మానం మనవార్తలు ,విజయవాడ: స్వామి వివేకానంద 163వ జయంతిని పురస్కరించుకుని…
దేశ ప్రతిష్టను విశ్వవ్యాప్తం చేసిన మహనీయుడాయన ఆయన స్ఫూర్తితో యువత ముందుకు సాగాలి నీలం మధు ముదిరాజ్ చిట్కుల్ లో…
జాతీయ స్థాయి అండర్ 14 కబడ్డీ పోటీలలో అత్యుత్తమ ప్రదర్శన చేసిన తెలంగాణ జట్టు మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:…