హైద్రాబాద్:
మల్లేశం, ప్లేబ్యాక్, వకీల్ సాబ్ చిత్రాల ద్వారా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సినీ నటి అనన్య నాగల్ల నగరంలో సందడి చేశారు. భాగ్యనగర ఫ్యాషన్ వస్త్రాభరణాల ప్రియులకు సరికొత్త డిజైన్ ఉత్పత్తులను అందించేందు ఏర్పటు చేస్తున్నా “హైలైఫ్” లైఫ్‌స్టైల్ ఎగ్జిబిషన్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం బంజారాహిల్స్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో సినీ కథానాయికలు అనన్య, యశ్నచౌదరితోపాటు నగరానికి చెందిన పలువురు మోడల్స్ పాల్గొని తళుక్కమని మెరిశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఫ్యాషన్ షో ఆకట్టుకుంది. ప్రముఖ డిజైనర్లు రూపొందించిన డిజైన్‌వస్త్రాలను సినీ నటి అనన్యతోపాటు పలువురు మోడల్స్ ప్రదర్శించి అలరించారు.
ప్రస్తుతం తెలుగు, తమిళ చిత్రాల్లో నటిస్తున్నట్లు కథనాయిక అనన్య తెలిపారు. ఈనెల 29,30 తేదీల్లో మాదాపూర్‌లోని హెచ్‌ఐసిసి హోటల్‌లో హై లైఫ్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నట్లు నిర్వహకులు తెలిపారు. దేశవ్యాప్తంగా దాదాపు 300 మంది ప్రముఖ డిజైనర్లు డిజైన్ చేసిన సరికొత్త డిజైన్ ఉత్పత్తులను నగరవాసులకు అందిస్తున్నట్లు పేర్కొన్నారు