64 మందు రైతులకు 20 లక్షల రూపాయల సబ్సిడీపై వ్యవసాయ యంత్ర పరికరాల పంపిణీ
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు:
ఆధునిక వ్యవసాయంలో వ్యవసాయ యాంత్రీకరణ కీలకపాత్ర పోషిస్తుందని.. రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం సబ్సిడీతో వ్యవసాయ యాంత్రికరణ పరికరాలు అందిస్తుందని ఈ అవకాశాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని రైతులకు సబ్సిడీ పైన మంజూరైన వివిధ రకాల వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలను శనివారం సాయంత్రం పటాన్చెరు డివిజన్ పరిధిలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి చేతుల మీదుగా రైతులకు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో సాంప్రదాయ పద్ధతులతో వ్యవసాయం చేయడం మూలంగా తక్కువ దిగుబడితోపాటు అధిక ఖర్చు మూలంగా రైతు నష్టపోతున్నారని తెలిపారు. కృత్రిమ మేదస్సు ద్వారా తయారైన యంత్రాలు వాడకం ద్వారా సాగు వ్యయం తగ్గడంతో పాటు ఉత్పత్తుల పెరుగుతున్నాయని తెలిపారు. ప్రతి యంత్ర పరికరం పై ప్రభుత్వం 40 శాతం సబ్సిడీ అందిస్తోందని తెలిపారు. ఈ సందర్భంగా 64 మంది రైతులకు 20 లక్షల రూపాయల సబ్సిడీతో 27 లక్షల రూపాయల విలువైన వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలను అందజేశారు.ఈ కార్యక్రమంలో వెలిమల ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం చైర్మన్ బుచ్చిరెడ్డి, వ్యవసాయ శాఖ ఏడి మనోహర, వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు పాల్గొన్నారు.
