Telangana

గీతమ్ విద్యార్థి వంశీకి హార్వర్డ్ వరల్డ్ రికార్డ్

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ సీఎస్ఈ (ఏఐ అండ్ ఎంఎల్) రెండో ఏడాది చదుతున్న విద్యార్థి దేవరాజు వంశీ కృష్ణంరాజు అరుదైన ఘనత సాధించి హార్వర్డ్ను ఆకర్షించారు. ‘అధ్విక’ పేరుతో కృత్రిమ మేథ (ఏఐ) సంభాషణ: బాట్ప చేసిన కృషికి హార్వర్డ్ వరల్డ్ రికార్డ్స్, లండన్లో చోటు దక్కించుకున్నారు. ఈ విషయాన్ని గీతం అధ్యాపకులు. డాక్టర్ అనిత, డాక్టర్ త్రినాథరావులు గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించారు.”అధ్విక కృత్రిమ మేథ సంభాషణ బాబ్ అనేది సహజమైన, ఆకర్షణీయమైన సంభాషణలను సులభతరం చేయడానికి అత్యాధునిక సాంకేతికను ప్రభావితం చేసే ఒక గొప్ప ఆవిష్కరణ. ఇది తనదైన సొంత అధునాతన భాషా మోడల్తో కూడిన అద్భుతమైన వాయిస్ అసిస్టెంట్. ఇది మన పనులను నిర్వహించే విధానంలో విప్లవాత్మక మార్పులు చేయడానికి, ఉత్పాదకతను పెంచడానికి రూపొందించారు. విస్తృతమైన సామర్థ్యాలతో, వివిధ పనులను సులభతరం చేయడానికి, సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి అధ్విక మన దినచర్యలో సహకరిస్తుంది” అని వారు వివరించారు.

ఈ-మెయిల్ కంపోజ్ చేయడం, పంపడం నుంచి రిమెండర్లను సెట్ చేయడం, చేయాల్సిన పనుల జాబితాను రూపొందించడం వరకు అధ్విక ఓ విశ్వసనీయ సహచరుడన్నారు. ప్రతి పదాన్ని చూసి చెప్పుచేసే విధానానికి స్వస్తిపలికి, మంచి పదాలతో రాయగలిగేందుకు ఇది సహకరిస్తుందని వారు తెలిపారు. వర్డ్ డాక్యుమెంట్ లేదా పీడీఎఫ్ అయినా, మన ఆలోచనలకు అనుగుణంగా అధ్విక వాటిని చక్కగా, నిర్మాణాత్మకంగా, వృత్తిపరంగా ఫార్మాట్ చేసిన ఫెద్దగా మార్చి, మన విలువైన సమయం, కృషిని ఆదా చేస్తుందని గీతం అధ్యాపకులు వివరించారు.ముఖ్యమైన సమావేశాలు లేదా గడువులను మనం మర్చిపోకుండా అధ్విక గుర్తుచేస్తుందని, దాన్ని సహజమైన ఇంటర్ఫేస్, ఇంటెలిజెంట్ అల్గారిథమ్లతో మన ప్రాధాన్యతలకు అనుగుణంగా ఉండడమే గాక, గరిష్ట. ఉత్పాదకత కోసం మన రోజువారీ కార్యకలాపాలను సులభతరం చేస్తుందని పేర్కొన్నారు. అధ్విక నిరంతరం మన పరస్పర చర్యల నుంచి నేర్చుకుంటుంది, కాలక్రమేణా మన ప్రత్యేక రచనా శైలి, పదజాలం, ప్రాధాన్యతలను అర్థం. చేసుకుంటుందని, ఇది మన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవనానికి ఓ తోడుగా పనిచేస్తుందని అధ్యాపకులు వివరించారు.

తాను ఈ స్థాయి ప్రశంస అందుకోవడానికి నిరంతరం తనకు మద్దతుగా నిలిచిన అధ్యాసకులకు వంశీ కృ తజ్ఞతలు తెలియజేయడమే గాక, వారి అమూల్య మార్గదర్శనం, ప్రోత్సాహం లేకుండా ఉంటే, ఈ విజయం సాధ్యమయ్యేది కాదని అన్నట్టు వారు తెలియజేశారు. హార్వర్డ్ వరల్డ్ రికార్డ్ పొందిన వంశీ కృష్ణంరాజును గీతం హెదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీఎస్వు, స్కూల్ ఆఫ్ టెక్నాలజీ డెరెక్టర్ ప్రొఫెసర్ వి.రానుశాస్త్రి, అసోసియేట్ డెరెక్టర్ ప్రొఫెసర్ ఎన్. సీతారామయ్య, సీఎస్ఈ విభాగాధిపతి సుదీప్ సుకుమారన్ కథవిల్, రెసిడెంట్ డెరైక్టర్ టీవీవీఎస్ఆర్ వర్మ తదితరులు ప్రశంసించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

admin

Recent Posts

సమాజానికే సందేశం గాంధీజీ జీవన విధానం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…

6 days ago

మాతృభూమిపై మమకారాన్ని చాటే అపూర్వ అవకాశం వికసిత్ భారత్ రన్‌

మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…

2 weeks ago

కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు కొనసాగిస్తాం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…

2 weeks ago

గొప్ప గాంధేయవాది కొండా లక్ష్మణ్ బాపూజీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…

2 weeks ago

పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేవి సైన్స్ ఎగ్జిబిషన్ లు

- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…

3 weeks ago

వికలాంగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…

3 weeks ago