శేరిలింగంపల్లి,మనవార్తలు ప్రతినిధి :
చిన్నప్పటి నుండి కుస్తీ పోటీలో శిక్షణ పొందిన ఆ విద్యార్థి సిల్వర్ మెడల్ సాధించి తన సత్తా చాటాడు. ఇందుకు సంబంధించిన వివరాలను స్కూల్ యాజమాన్యం తెలిపింది. శేరిలింగంపల్లి మండల పరిధిలో గల రాయదుర్గం లోని నాగార్జున హై స్కూల్ లో పదో తరగతి చదువుతున్న ఎస్. హరిచరణ్ ఢిల్లీ లో రెజిలింగ్ ఫ్రీడమ్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరిగిన జాతీయ పోటీలో జూనియర్ చాంపియన్ షిప్ విభాగంలో తన సత్తా చాటి సిల్వర్ మెడల్ ను కైవసం చేసుకున్నాడు. మంచి పట్టుదలతో తన ప్రతిభతో మెడల్ సాధించిన హరిచరణ్ ను నాగార్జున స్కూల్ కరస్పాండెంట్ భరత్ కుమార్, ప్రిన్సిపాల్ సుందరీలతో పాటు సిబ్బంది అభినందించారు. తన విజయంతో తమ స్కూల్ కు, తల్లిదండ్రులకు, తమ ప్రాంతానికి మంచిపేరు తెచ్చినందుకు సంతోషం వ్యక్తం చేస్తూ ముందు ముందు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…
చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…
రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…
పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…
నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…