Telangana

కూచిపూడి నృత్యానికి గిన్సిస్ రికార్డు

శేరిలింగంపల్లి,మనవార్తలు ప్రతినిధి :

తెలుగు సాంప్రదాయ కళ కూచిపూడి నృత్య ప్రదర్శన గిన్సిస్ బుక్ ఆఫ్‌ వరల్డ్ రికార్డు సాధించడం గర్వంగా ఉందన్నారు మంత్రులు సీతక్క, జూపల్లి కృష్ణారావు. కళలను ముందు తరాలకు అందించాల్సిన బాధ్యత మన అందరిపైన ఉందన్నారు. భారత్ ఆర్ట్స్ అకాడమి ఆధ్వర్యంలో గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన కూచిపూడి నృత్యప్రదర్శనలో వారు పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన 3,782 మంది కళాకారులు ఒక్కసారిగా సామూహికంగా ఏడు నిమిషాలపాటు కూచిపూడి నృత్య ప్రదర్శన నిర్వహించి రికార్డును సొంతం చేసుకున్నారు.

గచ్చిబౌలి స్టేడియానికి కూచిపూడి నృత్య గురువులు, కళాకారులు, విద్యార్థులు.. వారి తల్లిదండ్రులు ఆదివారం ఉదయం 8 గంటలకే చేరుకొని ప్రదర్శించాల్సిన నృత్యాలను ప్రాక్టీస్ చేశారు. అనంతరం మధ్యాహ్నం భోజనం తర్వాత మేకప్‌ వేసుకొని కార్యక్రమానికి హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను నిర్వాహకులు చేపట్టారు. భారత్ ఆర్ట్స్ అకామి వ్యవస్థాపక అధ్యక్షులు రమణారావు, అధ్యక్షులు లలితారావుల ఆధ్వర్యంలో ఈ ప్రదర్శన సాగింది. ఈ కార్యక్రమాన్ని పరిశీలించేందుకు వచ్చిన గిన్నిస్ బుక్ ఆఫ్‌ వరల్డ్ రికార్డు ప్రతినిధి రిషిత్ నాథ్ ప్రదర్శనను ప్రత్యక్షంగా చూసి గిన్నిస్ రికార్డు సాధించినట్లుగా స్టేజీపైన ప్రకటించారు. దీంతో కళాకారుల హర్షద్వానాల మధ్య స్టేడియం మారుమోగింది.

కూకట్ పల్లికి చెందిన శ్వేత తన శిష్య బృందంతో కలిసి ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. తన దశాబ్దన్నర నృత్య జీవితంలో ఈ రికార్డు మరువలేనిదన్నారు. తన బృందంతో కలిసి ఈ గిన్నిస్ వరల్డ్ రికార్డులో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు.ఈ కార్యక్రమాన్ని తమ జీవితంలో మరువలేనిదని శ్వేత పేర్కొన్నారు. భారతీయ కళలకు ప్రపంచ వ్యాప్తంగా మంచి ఆదరణ ఉందని..వాటిని ఆదరించాల్సిన అసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో నాట్య గురువు పసుమర్తి శేషబాబుతోపాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.కళలను ముందు తరాలకు అందించాల్సిన అవసరం ఉందన్నారు మంత్రులు సీతక్క, జూపల్లి కృష్ణారావు. పాఠశాల స్థాయినుంచే పిల్లలకు లలిత కళలను అందించాలని వారు తల్లిదండ్రులకు సూచించారు.

admin

Recent Posts

సమాజానికే సందేశం గాంధీజీ జీవన విధానం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…

1 week ago

మాతృభూమిపై మమకారాన్ని చాటే అపూర్వ అవకాశం వికసిత్ భారత్ రన్‌

మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…

2 weeks ago

కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు కొనసాగిస్తాం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…

2 weeks ago

గొప్ప గాంధేయవాది కొండా లక్ష్మణ్ బాపూజీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…

3 weeks ago

పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేవి సైన్స్ ఎగ్జిబిషన్ లు

- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…

3 weeks ago

వికలాంగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…

3 weeks ago