Telangana

గీతమ్ లో ప్రమాణ సెక్రటేరియట్ ప్రారంభం

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ మంగళవారం ప్రమాణ 2024 సచివాలయాలన్ని కోర్. ఇంజనీరింగ్ డీన్ ప్రొఫెసర్ రామశాస్త్రి వేదాల ప్రారంభించారు. గీతమ్ లో ప్రతియేటా సాంకేతిక సాహిత్య-నిర్వహణల మేలు కలయికగా నిర్వహించే మూడు రోజుల పండుగకు సన్నాహకంగా ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. సాంకేతిక శిక్షణ, ఉపన్యాసాలు, పోటీలతో పాటు ర్యాంప్ వాక్, సింఫోనీ, కన్సర్ట్, బ్యాటిల్ ఆఫ్ బ్యాండ్స్, కార్నివాల్, పలు యాజమాన్య మెళకువలను నేర్పే పోటీల సమాహారంగా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ప్రమాణ కార్యాలయాన్ని ఆరంభించిన సందర్భంగా ప్రొఫెసర్ రామశాస్త్రి మాట్లాడుతూ, నూతన సాంకేతికత మేళవింపుతో కార్యక్రమాలను ఎంపికచేసి, ఇతర కళాశాలల విద్యార్థులు విరివిగా పాల్గొనేలా వాటిని రూపొందించమని సూచించారు. రోబోటిక్స్, ఈ-యంత్ర, హ్యాకథాన్, డిజెన్ పోటీలతో పాటు ఇతరత్రా కార్యక్రమాలను అత్యాధునిక సాంకేతికతతో ఉండేలా చూడాలన్నారు. ప్రచారం విద్యార్థులను ఆకర్షిస్తుందని, ఎక్కువ మంది పాల్గొంటేనే మన ఉత్సవ ప్రతిష్ట ఇనుమడిస్తుందని చెప్పారు. కార్యక్రమాల కూర్పు అనంతరం వెబ్ సైట్లో అన్ని వివరాలను పొందుపరచి, ఇతర కళాశాలల విద్యార్థులకు ఆ సమాచారం చేరేలా చూడాలని సలహా ఇచ్చారు.

గీతం, హైదరాబాద్ లో ఉన్న ఏడు స్కూళ్ళ (టెక్నాలజీ, మేనేజ్మెంట్, సిన్ట్స్, ఫార్మశీ, ఆర్కిటెక్చర్, హ్యుమానిటీస్, పబ్లిక్ పాలసీ) విద్యార్థులందరూ పాల్గొనేలా కార్యక్రమాలకు రూపకల్పన చేయాలని స్కూల్ ఆఫ్ బిజినెస్ ప్రొఫెసర్ కరుణాకర్.బి సూచించారు.గత ఉత్సవాల కంటే ఈ ఏడాది ప్రమాణ- 2024 మేటిగా ఉండేలా తీర్చిదిద్దమని ప్రమాణ నిర్వహకుడు. డాక్టర్ సి.త్రినాథరావులు సూచించారు.గీతం రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, వివిధ విభాగాధిపతులు, పలువురు విద్యార్థులు ప్రమాణ-2024 కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. గీతం వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ ఎంవీవీఎస్ మూర్తికి ఈ సందర్భంగా నివాళులర్పించారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

9 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

9 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

9 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

9 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

9 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

9 hours ago