మనవార్తలు ,పటాన్ చెరు:
మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా అందుకున్న గీతం అధికారులు గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం , హైదరాబాద్ ప్రాంగణానికి హరిత హారం అవార్డు వచ్చినట్టు అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్ గురువారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు . హరిత హారంలో భాగంగా 2021 సంవత్సరంలో గీతం 32 వేలకు పైగా మొక్కలు నాటినందుకు గాను జాతీయ పరిశ్రమల సమాఖ్య ( సీఐఐ ) తెలంగాణ విభాగం హైదరాబాద్లో మార్చి 3 న నిర్వహించిన వార్షిక సదస్సులో ఈ అవార్డును ప్రదానం చేసినట్టు తెలిపారు .
తెలంగాణ ఐటీ , పరిశ్రమలు , పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కె.తారకరామారావు చేతుల మీదుగా ఈ అవార్డును గీతం రెసిడెంట్ డెరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ , గీతం హైదరాబాద్ బిజినెస్ స్కూల్ డెరైక్టర్ ప్రొఫెసర్ బి.కరుణాకర్ అందుకున్నట్టు పేర్కొన్నారు . గీతమ్ అధిక సంఖ్యలో మొక్కలు నాటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరిత హారం కార్యక్రమం విజయవంతం కావడానికి తోడ్పడినట్టు డాక్టర్ శివప్రసాద్ తెలియజేశారు . దీనికి గుర్తింపుగానే గత ఐదేళ్ళుగా వరుసగా ఈ ప్రతిష్టాత్మక అవార్డును గీతం అందుకున్నట్టు ఆయన వివరించారు . ఈ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమంలో సీఐల తెలంగాణ చెర్మన్ కృష్ణ , బొందనపు , భారత్ బయోటెక్ సీఎండీ కృష్ణ యెల్ల , తెలంగాణ ప్రభుత్వ ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ , సీఐఐ ఉన్నతాధికారులు తదితరులు కూడా పాల్గొన్నట్టు ఆ ప్రకటనలో
శ్రీ భగవాన్ సత్యసాయి సేవాసమితి చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మానవసేవయే మాధవసేవ…
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…
ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…
భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…
భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…