Telangana

నాయర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా ఓనం వేడుకలు

ముఖ్యఅతిథిగా హాజరైన పటాన్‌చెరు మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు:

నాయర్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో పటాన్‌చెరు నియోజకవర్గ పరిధిలోని రామచంద్రపురం డివిజన్లో స్త్రీ కన్వెన్షన్ లో కేరళ రాష్ట్ర ప్రధాన పండగ ఓనం పండగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా పటాన్‌చెరు మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ పాల్గొన్నారు. అనంతరం మెట్టు కుమార్ యాదవ్ మాట్లాడుతూ కేరళం రాష్ట్ర ముఖ్య పండగ ఓనం వేడుకలలో పాల్గొనడం చాలా సంతోషకరంగా ఉందని అన్నారు.ప్రేమ, సోదరభావం, ఐక్యతకు ప్రతీకగా నిలిచే ఓనం ప్రతి కుటుంబంలో ఆనందాన్ని నింపాలి.మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకుంటూ అందరం కలిసిమెలిసి ముందుకు సాగాలి.ఈ ఓనం ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, శాంతి, శ్రేయస్సు తీసుకురావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో నాయర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు మధుసూదన్ పిళ్ళై , జనరల్ సెక్రెటరీ వినోద్ కుమార్ , శశిధరన్ నంబియార్ , అనిల్ కుమార్ , సంతోష్ , సుదర్శన్ ,ఆల్విన్ కాలనీ ప్రెసిడెంట్ సత్యనారాయణ , మిల్క్ రాజు తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

8 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

8 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

8 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

8 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

8 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

8 hours ago