Telangana

సంగారెడ్డి జిల్లా బీజేపీ స్పోర్ట్స్ సెల్ కన్వీనర్ గా కృష్ణ మూర్తి చారి నియామకం

మనవార్తలు ప్రతినిధి,సంగారెడ్డి :

భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎన్ రామచందర్ రావు ఆదేశాల మేరకు సంగారెడ్డి జిల్లా బిజెపి అధ్యక్షురాలు శ్రీమతి గోదావరి అంజిరెడ్డి వివిధ సెల్ లకు కన్వీనర్లను నియమించారు. ఇందులో భాగంగా పటాన్‌చెరువుకు చెందిన బిజెపి సీనియర్ నాయకులు కంజర్ల కృష్ణమూర్తి చారిని సంగారెడ్డి జిల్లా స్పోర్ట్స్ సెల్ కన్వీనర్ గా నియమించారు. ఈ సందర్భంగా కంజర్ల కృష్ణమూర్తి చారి మాట్లాడుతూ తనకు ఈ పదవిని ఇచ్చినందుకు రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రామచందర్ రావుకి, మెదక్ ఎంపీ శ్రీ రఘునందన్ రావు కి, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ శ్రీ అంజిరెడ్డి కి, మరియు జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి గోదావరి అంజిరెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు .సంగారెడ్డి జిల్లా మరియు పటాన్‌చెరు నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ కార్యవర్గ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు తనకు ఇచ్చిన సంగారెడ్డి జిల్లా స్పోర్ట్స్ సెల్ కన్వీనర్ బాధ్యతలను సమర్థవంతంగా మరియు పార్టీ అభివృద్ధి చెందే విధంగా నిర్వహిస్తానని, భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతాలను పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తానని కృష్ణ మూర్తి చారి తెలిపారు

 

 

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

8 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

8 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

9 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

9 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

9 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

9 hours ago