Telangana

చిట్కుల్ లో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

అసమానతల నిర్మూలనే అసలైన స్వేచ్ఛ

బడుగులకు న్యాయం కాంగ్రెస్ తోనే సాధ్యం

మహనీయుల ఆశయాలకు అనుగుణంగా రేవంత్ పాలన.. నీలం మధు ముదిరాజ్ 

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు:

దేశంలో ఆర్థిక, సామాజిక, రాజకీయ అసమానతలు పూర్తిగా తొలగిపోయినప్పుడే భారత్ నిజమైన ప్రగతి బాటలో పయనిస్తుందని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి నీలం మధు ముదిరాజ్ తెలిపారు. శనివారం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని చిట్కుల్‌లోని ఎస్సీ కాలనీ, మాల బస్తి, అంగన్వాడి కేంద్రం, దుర్గమ్మ గుడి సమీపం, ముదిరాజ్ కాలనీ, గొల్ల కురుమ యాదవ సంఘం, వార్డు కార్యాలయం, పల్లె దవకాన, చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద, పలు కాలనీలలోని జాతీయ జెండా ఆవిష్కరణ వేడుకల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని, స్థానిక ఎన్.ఎం.ఆర్ క్యాంపు కార్యాలయంలో మువ్వన్నెల జెండాను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ, వలస పాలన నుంచి దేశానికి స్వేచ్ఛను సాధించిపెట్టిన కాంగ్రెస్ పార్టీ, నేడు బడుగు, బలహీన వర్గాల ఆర్థిక వికాసానికి, సామాజిక భద్రతకు ప్రాధాన్యమిస్తూ పాలన సాగిస్తోందని కొనియాడారు. సామాజిక అసమానతలను రూపుమాపేందుకు విద్యా, వైద్య, ఉపాధి రంగాల్లో ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిందని ఆయన వివరించారు. బడుగు వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్యనందించేందుకు ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను నెలకొల్పడంతో పాటు స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రాల ద్వారా యువతకు సాంకేతిక నైపుణ్య శిక్షణ అందిస్తున్నారని పేర్కొన్నారు.తెల్ల రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు ‘మహాలక్ష్మి’ పథకం ద్వారా రూ. 500 కే గ్యాస్ సిలిండర్, ‘గృహ జ్యోతి’ కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్ , ‘రాజీవ్ ఆరోగ్యశ్రీ’ ఉచిత వైద్య పరిమితిని రూ. 10 లక్షలకు పెంచడం ద్వారా ప్రతీ పేద కుటుంబానికి కొండంత అభయం లభించిందని తెలిపారు.

నేడు సంగారెడ్డి కేంద్రంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నూతన డిజిటల్ రేషన్ కార్డులను ప్రవేశపెట్టనున్నారనిఈ రేషన్ కార్డుల ద్వారా సంక్షేమ ఫలాలు నేరుగా అర్హులకు అందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే ‘రాజీవ్ యువ వికాసం’ ద్వారా యువత స్వయం ఉపాధి సాధించడానికి రుణాలు, రాయితీలు లభిస్తున్నాయని వివరించారు. మహనీయులు కలలు కనిన సమానత్వ ప్రాతిపదికన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతోందని, సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుంటూ ప్రతి ఒక్కరూ ఆర్థికంగా ఎదగడమే నాటి స్వాతంత్ర్య పోరాట యోధులకు ఇచ్చే నిజమైన నివాళి అని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

అల్జీమర్స్ వ్యాధిగ్రస్తులకు అద్భుతమైన వరం – డాక్టర్ శ్రీకాంత్ వేముల

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ : దేశంలోనే మొట్టమొదటి సారిగా ట్రాన్స్ క్రేనియల్ పల్స్ స్టిమ్యులేషన్ టెక్నాలజీని సోలేషియం సెంటర్లో ఏర్పాటుఅల్జీమర్స్…

14 hours ago

ప్రభుత్వ బడుల్లో మత ప్రచారాలు చేపిస్తారా?

అమాయక చిన్నారులతో మత మార్పిడిని ప్రోత్సహిస్తారా? ఎమ్మెల్సీ డా. చిన్నమైల్ అంజిరెడ్డి తీవ్ర ఆగ్రహం చిట్కుల్ గర్ల్స్ రెసిడెన్షియల్ స్కూల్…

14 hours ago

ఎస్ఐ ఆర్ లో దరఖాస్తు చేసుకున్న ఓటర్ల అందరికీ ఓటు హక్కు కల్పించే విధంగా చర్యలు చేపట్టాలి సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు వాజిద్ అలీ

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ఎస్ఐ ఆర్ లో దరఖాస్తు చేసుకున్న ఓటర్ల అందరికీ ఓటు హక్కు కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని…

14 hours ago

‘గేట్’ ద్వారా అవకాశాలను అందిపుచ్చుకోండి

గీతం విద్యార్థులకు గేట్ ఏరోస్పేస్ అకాడమీకి చెందిన అశోక్ నాయుడు సూచన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ఇంజనీరింగ్ లో గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్…

14 hours ago

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

1 day ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

1 day ago