Telangana

మియాపూర్‌లో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

యలమంచి ఉదయ్ కిరణ్ ఆధ్వర్యంలోజాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన శ్రీ వి. జగదీశ్వర్ గౌడ్

మనవార్తలు ప్రతినిధి,మియాపూర్‌:

దేశభక్తి, ఐక్యత, జాతీయ గౌరవాన్ని ప్రతిబింబించేలా మియాపూర్‌లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మియాపూర్ జనరల్ సెక్రటరీ శ్రీ యలమంచి ఉదయ్ కిరణ్ గారి ఆధ్వర్యంలో మియాపూర్ మెయిన్ రోడ్డు పక్కన నిర్వహించిన ఈ వేడుకల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని దేశభక్తిని చాటుకున్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన టీ.పి.సి.సి. జనరల్ సెక్రటరీ మరియు శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ శ్రీ వి. జగదీశ్వర్ గౌడ్ గారు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జాతీయ జెండాకు వందనం చేసి, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు.ఈ సందర్భంగా శ్రీ జగదీశ్వర్ గౌడ్ గారు మాట్లాడుతూ భారత రాజ్యాంగ విలువలను గౌరవిస్తూ దేశ ఐక్యత, సమగ్రత, అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతతో పనిచేయాలని పిలుపునిచ్చారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల స్ఫూర్తితో యువత దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు.

రాజ్యాంగ స్ఫూర్తిని ప్రతిబింబించిన ప్రత్యేక ఫ్లెక్స్

ఈ వేడుకల్లో యలమంచి ఉదయ్ కిరణ్ ఫ్లెక్స్ టీమ్ సభ్యులు ఏర్పాటు చేసిన ప్రత్యేక సృజనాత్మక ఫ్లెక్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భారత రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్. అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని శ్రీ యలమంచి ఉదయ్ కిరణ్ గారికి అందజేస్తున్నట్టుగా రూపొందించిన వినూత్నమైన ఫ్లెక్స్ సందర్శకులు, స్థానిక ప్రజల దృష్టిని విశేషంగా ఆకర్షించింది.రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య స్ఫూర్తి, సమానత్వం, సామాజిక న్యాయం మరియు దేశభక్తి భావనలను ప్రతిబింబించేలా రూపొందించిన ఈ ప్రదర్శనపై పలువురు అభినందనలు వ్యక్తం చేశారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో రాజ్యాంగ ప్రాధాన్యతను ప్రత్యేకంగా చాటిచెప్పేలా ఈ సృజనాత్మక ఆలోచన నిలిచింది.కార్యక్రమంలో ఆలపాటి శివాజీ, బాబ్జీ, కావూరి ప్రసాద్, యాదగిరి, గౌస్, గిరి, రవీందర్ రెడ్డి, రాంచందర్, రవి కుమార్, నరేందర్ మన్నె, విజయ్, రాజన్, గణేష్, అమరేందర్, రాంబాబు, నాని, నాయుడు, శ్రీరామ్, కామినేని వాసు, రామకృష్ణ, నవీన్, కార్తీక్, సుబ్బు, వంశీ, ప్రవీణ్, రత్నాచారి, రాధాకృష్ణ, నాగసాయి, శివ, రాజేష్, సతీష్ రెడ్డి, తాహిర్, సందీప్, గోపి, సాయి, గురువులు, రాహుల్, శ్రీనివాసు, వెంకటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.

 

 

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

8 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

8 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

9 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

9 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

9 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

9 hours ago