మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు:
ఎస్ఐ ఆర్ లో దరఖాస్తు చేసుకున్న ఓటర్ల అందరికీ ఓటు హక్కు కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు వాజిద్ అలీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పటాన్ చెరు నియోజకవర్గం ఈ ఆర్ ఓ వెంకటేశ్వరరావు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వాజిద్ అలీ మాట్లాడుతూ ఎస్ఐ ఆర్ ప్రక్రియలో భాగంగా పటాన్ చెరు నియోజకవర్గంలో ప్రస్తుత ఓటర్ లిస్టులో పేర్లు వచ్చినా, లక్ష మందికి ఓటర్లకు నోటీసులు వచ్చినాయన్నారు. ఆగస్టు 10వ తేదీ వరకు ఎస్ ఐ ఆర్ దరఖాస్తుల గడువును విధించడం జరిగిందని, ఎస్ఐఆర్ సందర్భంగా ఓటర్లకు ఇచ్చిన దరఖాస్తులను అందరూ సక్రమంగానే పూర్తిచేసి సంబంధిత బి ఎల్ ఓ లకు ఇచ్చారని గుర్తు చేశారు. వేలాదిమందికి ఓటర్ లిస్టులో పేరు ఉండి, సక్రమంగా దరఖాస్తు ఫారం పూర్తి చేసిన సంబంధిత ఓటర్లకు ఎందుకు నోటీసు ఇచ్చారని ప్రశ్నించారు. పేరు చిరునామాలో అక్షరాలు తప్పుగా పడ్డాయనే కారణంతో నోటీసులు ఇచ్చిన వారందరూ సమాధానం చెప్పాలన్నడం సరియైన పద్ధతి కాదని మండిపడ్డారు. కిందిస్థాయి అధికారుల నిర్లక్ష్యం వల్లనే నోటీసులు వచ్చాయని, నోటీసులు అన్నిటిని కింది స్థాయిలో ఉన్న బిఎల్ఓ నే నేరుగా ఓటర్లకు నోటీసులు ఇవ్వాలని అన్నారు. అనేకమంది ఇచ్చిన సమయానికి నేరుగా సంబంధిత కార్యాలయం వద్దకు వెళితే పట్టించుకునే అధికారులు కరువయ్యారని పాప పోయారు. పటాన్ చెరు, ఇస్నాపూర్, ఇంద్రేశం, బీరంగూడ ,అమీన్పూర్, కొల్లూరు అనేక ప్రాంతాలలో వేలాదిమంది నోటీసులు తీసుకున్న వారు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, అందుకోసం ఎస్ఐఆర్ ప్రక్రియ వేగవంతం చేసి పూర్తయ్యే వరకు అధికారులందరూ సహకరించాలని డిమాండ్ చేశారు. ఓటర్లందరికి తగిన సమయం ఇచ్చి, గడువు పెంచాలని దరఖాస్తులు పారాలు ఓటర్లందరికి తగినన్ని అందుబాటులో ఉంచేలా చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ ఏరియా కమిటీ కార్యదర్శి బి నాగేశ్వరరావు, సురేష్ లు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ : దేశంలోనే మొట్టమొదటి సారిగా ట్రాన్స్ క్రేనియల్ పల్స్ స్టిమ్యులేషన్ టెక్నాలజీని సోలేషియం సెంటర్లో ఏర్పాటుఅల్జీమర్స్…
అమాయక చిన్నారులతో మత మార్పిడిని ప్రోత్సహిస్తారా? ఎమ్మెల్సీ డా. చిన్నమైల్ అంజిరెడ్డి తీవ్ర ఆగ్రహం చిట్కుల్ గర్ల్స్ రెసిడెన్షియల్ స్కూల్…
గీతం విద్యార్థులకు గేట్ ఏరోస్పేస్ అకాడమీకి చెందిన అశోక్ నాయుడు సూచన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ఇంజనీరింగ్ లో గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్…
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…