Telangana

అల్జీమర్స్ వ్యాధిగ్రస్తులకు అద్భుతమైన వరం – డాక్టర్ శ్రీకాంత్ వేముల

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ :

దేశంలోనే మొట్టమొదటి సారిగా ట్రాన్స్ క్రేనియల్ పల్స్ స్టిమ్యులేషన్ టెక్నాలజీని సోలేషియం సెంటర్లో ఏర్పాటుఅల్జీమర్స్ డిమెన్షియాతో బాధపడుతున్న వారికి చికిత్స లేదనుకునేవారు. కానీ ఇప్పుడు అల్జీమర్స్ వ్యాధిగ్రస్తులకు జర్మనీకి చెందిన ఆధునిక టెక్నాలజీతో రూపొందించిన టిపిఎస్ (ట్రాన్స్ క్రేనియల్ పల్స్ స్టిమ్యులేషన్) టెక్నాలజీ అల్జీమర్స్ వ్యాధిగ్రస్తులకు వరం లాంటిదని ప్రముఖ న్యూరాలజిస్ట్, సొలేషియం సెంటర్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్రీకాంత్ వేముల తెలిపారు. మాదాపూర్లోని సొలేషియం సెంటర్లో ఈ ఆధునిక టెక్నాలజీని జర్మనీకి చెందిన ప్రొఫెసర్ డాక్టర్ ఉల్రిచ్ స్ప్రిక్ తో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా డాక్టర్ శ్రీకాంత్ వేముల మాట్లాడుతూ అల్జీమర్స్, డిమెన్షియా వస్తే చికిత్స లేక బాధపడేవారు. కానీ ఈ నాన్ ఇన్వేజివ్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ టెక్నాలజీతో మెదడు లోపలికి ఎలాంటి పరికరాలను పంపించకుండానే బయటనుంచే ఈ పరికరంతో మెదడులో దెబ్బతిన్న నరాలను ప్రేరేపించడం (స్టిమ్యులేట్ చేయడం) ద్వారా ఆ నరాలు ప్రేరేపితం కావడంతో కోల్పోయిన జ్ఞాపకశక్తి తిరిగి రావడం, రోజు వారి కార్యక్రమాల్లో చాలా వరకు బెటర్ అవుతారని తెలిపారు. ఈ టెక్నాలజీని ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా కొన్ని సెంటర్లలో ఉపయోగిస్తున్నారని, భారతదేశంలో మొట్టమొదటి సారిగా హైదరాబాద్, హైటెక్ సిటిలోని సోలేషియం సెంటర్లో అందుబాటులోకి తీసువచ్చామని తెలిపారు.

ఈ టెక్నాలజీ అల్జీమర్స్ వ్యాధిగ్రస్తులకు వరం లాంటిదని, ఈ టెక్నాలజీ వల్ల అల్జీమర్స్ వ్యాధిగ్రస్తులకు అద్భుతంగా పనిచేస్తుందని ప్రొఫెసర్ డాక్టర్ ఉల్రిచ్ స్ప్రిక్ తెలిపారు. ఈ సందర్భంగా న్యూరాలజిస్ట్లకు, సైక్రియాటిస్ట్లకు ఈ టెక్నాలజీపై అవగాహన కల్పిస్తూ, ఈ టెక్నాలజీని కొంతమంది పార్కిన్సన్స్ వ్యాధిగ్రస్తులకు, ఆటిజంతో బాధపడే పిల్లలకు, మతిమరుపుతో బాదపడే వారికి కూడా టిపిఎస్ ఉపయోగపడుతుందని తెలిపారు.

admin

Recent Posts

ప్రభుత్వ బడుల్లో మత ప్రచారాలు చేపిస్తారా?

అమాయక చిన్నారులతో మత మార్పిడిని ప్రోత్సహిస్తారా? ఎమ్మెల్సీ డా. చిన్నమైల్ అంజిరెడ్డి తీవ్ర ఆగ్రహం చిట్కుల్ గర్ల్స్ రెసిడెన్షియల్ స్కూల్…

14 hours ago

ఎస్ఐ ఆర్ లో దరఖాస్తు చేసుకున్న ఓటర్ల అందరికీ ఓటు హక్కు కల్పించే విధంగా చర్యలు చేపట్టాలి సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు వాజిద్ అలీ

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ఎస్ఐ ఆర్ లో దరఖాస్తు చేసుకున్న ఓటర్ల అందరికీ ఓటు హక్కు కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని…

14 hours ago

‘గేట్’ ద్వారా అవకాశాలను అందిపుచ్చుకోండి

గీతం విద్యార్థులకు గేట్ ఏరోస్పేస్ అకాడమీకి చెందిన అశోక్ నాయుడు సూచన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ఇంజనీరింగ్ లో గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్…

14 hours ago

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

1 day ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

1 day ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

1 day ago