పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ , హైదరాబాద్ లోని గణిత శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థిని బి.జపమాల రాణిని డాక్టరేట్ వరించింది. ‘సాధారణీకరించిన కుంభాకారం ద్వారా విరామం-విలువ ప్రోగ్రామింగ్ సమస్యల అధ్యయనం’పై ఆమె సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు. ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గణిత శాస్త్ర విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కృష్ణ కుమ్మరి ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు. రేఖ సిద్ధాంత వ్యాసం, సర్వోత్తమీకరణం సమస్య అనిశ్చితి డేటాను పరిష్కరించడానికి సాంకేతికతలను పరిచయం చేసిందని తెలిపారు. లాంగ్రజ్ ఫంక్షన్ సాడిల్ పాయింట్ పరిస్థితులు వివిధ రకాల విరామం-విలువ ప్రోగ్రామింగ్ సమస్యలతో పాటు పరిష్కారాలు, వాటి నిర్మాణ లక్షణాలను కూడా పరిశీలించినట్టు డాక్టర్ కృష్ణ వివరించారు. జపమాల రాణి సమర్పించిన సిద్ధాంత వ్యాసం పీహెచ్ డీ పట్టాకు అర్హత సాధించడం పట్ల గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్. రావు, గీతం రెసిడెంట్ డైరక్టర్ డీవీపీఎస్ఆర్ వర్మ, స్కూల్ ఆఫ్ సెన్స్ ఇన్ఛార్జి ప్రిన్సిపాల్, గణిత శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ ఎం.రెజా, పలు విభాగాల అధిపరులు, అధ్యాపకులు, సిబ్బంది పలువురు అభినందించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాల్సిందే డివిజన్ల ఏర్పాటులో శాస్త్రీయత లోపించింది. సంక్రాంతి తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రజాభీష్ఠం మేరకు కిష్టారెడ్డిపేట డివిజన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర…
చిట్కుల్ లో ఓబన్న చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించిన నీలం.. మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రజల…
రుద్రారం మల్లన్న స్వామి జాతరలో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: మల్లన్న స్వామి ఆశీస్సులు…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో శ్రామిక సంక్షేమ కేంద్రం కో - ఆర్డినేటర్…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…