మనవార్తలు ,పటాన్ చెరు:
గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం , హైదరాబాద్లో మంగళవారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు . ‘ మానవత్వం కోసం యోగా ‘ అనే ఇతివృత్తంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు విద్యార్థులు , అధ్యాపకులు , సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు . తొలుత , గీతం హైదరాబాద్ రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ ప్రసంగంతో ఈ వేడుకలు ప్రారంభమయ్యాయి . యోగా గురించి , రోజువారీ జీవితంలో యోగ సాధన చేయడం వలన కలిగే ప్రయోజనాలను ఆయన వివరించారు . ఆరోగ్యకరమైన శరీరం , మనస్సుల కోసం , అలాగే పనిలో ఒత్తిడిని తగ్గించడానికి నిత్యం యోగ సాధన ఎలా ఉపకరిస్తుందో ఆయన విడమరిచి చెప్పారు .
ఇతర ఔత్సాహిక సాధకులతో కలిసి ఆయన యోగా సాధనలో ఉత్సాహంగా పాల్గొన్నారు . ఈ కార్యక్రమంలో స్కూల్ ఆఫ్ సెన్స్ విశిష్ట ఆచార్యుడు ప్రొఫెసర్ జీ.ఏ.రామారావు పాల్గొని యోగ సాధనను చేయించడంతో పాటు జీవితంలో యోగా శాస్త్రీయ ఔచిత్యం , ప్రాముఖ్యతలను సాధకులకు వివరించారు . ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని గీతం స్పోర్ట్స్ , స్టూడెంట్ లెఫ్ట్ డెరైక్టరేట్ల సౌజన్యంతో ఎన్సీసీ , ఎన్ఎస్ఎస్ యూనిట్ల నిర్వహించాయి .
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…
ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…
భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…
భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…
సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల సిఎస్ఆర్ నిధులు స్థానిక…