మనవార్తలు ,పటాన్ చెరు:
భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని , గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం , హెదరాబాద్ ప్రాంగణంలో ‘ ఇంజనీర్స్ దినోత్సవాన్ని ‘ గురువారం ఘనంగా నిర్వహించారు . హైదరాబాద్ లోని బీహెచ్ఎల్ డిప్యూటీ మేనేజర్ , ఫోరమ్ టు ఇంప్రూవ్ థింగ్స్ ( ఎఫ్ఎస్ఐటీ ) ప్రధాన కార్యదర్శి ఎం . భగత్సింగ్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు . సర్ విశ్వేశ్వరయ్య అసమాన సేవలను స్మరించుకోవడంతో పాటు , వర్ధమాన ఇంజనీర్లను ప్రోత్సహించడం , తద్వారా వారు ఉన్నతస్థాయికి ఎదిగేలా ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్టు గీతం హెదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీఎస్ రావు పేర్కొన్నారు . స్మార్ట్ క్లబ్ ప్రారంభం ఎలక్ట్రికల్ , ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ ( ఈఈసీఈ ) విభాగంలో ‘ జి – ఎలక్ట్రా ‘ పేరుతో స్మార్ట్ సిస్టమ్స్ క్లబ్ల్ను ప్రొఫెసర్ డీఎస్ రావు ప్రారంభించారు . ఆ క్లబ్ విద్యార్థులు ప్రదర్శించిన రెస్క్యూ రోబోట్ , బ్లెండెన్ విజన్ , స్మార్ట్ పార్కింగ్ , మూగ చెవిటి వారికి ఉపకరించే ‘ సహాయ్ – యంత్రిన్ ‘ , ఫ్యాను – బల్బులను రిమోట్ కంట్రోల్తో నియంత్రించే ‘ టెలిగ్రామ్ కంట్రోల్డ్ రూమ్ ‘ వంటి పలు మోడళ్ళను ఆయన సందర్శించి , వాటి పనితీరు గురించి వివరంగా అడిగి తెలుసుకున్నారు .
విద్యార్థులలో ఉత్సాహాన్ని ఇనుమడింపజేయడం , ప్రజా జీవనాన్ని మరింత సుఖమయం చేసే పరికరాలు , వివిధ గాడ్జెట్ల ఆటోమేషన్పై సాంకేతిక అన్వేషణకు పురిగొల్పడం లక్ష్యంగా ఈ క్లబ్ు ఏర్పాటు చేసినట్టు ఈఈసీఈ విభాగాధిపతి డాక్టర్ టి.మాధవి పేర్కొన్నారు . రక్తదాన శిబిరం ‘ ఇంజనీర్స్ డే’ని పురస్కరించుకుని చరెవైతి ( గీతం విద్యార్థి విభాగం ) భారత రెడ్ క్రాస్ సొసెట్టీతో కలిసి గురువారం రక్తదాన శిబిరాన్ని మంజీరా సెమినార్ హాల్లో నిర్వహించింది . తలసేమియాతో బాధపడుతున్న రోగులకు రక్తాన్ని అందుబాటులో ఉంచాలనే లక్ష్యంతో ఏర్పాటుచేసిన ఈ శిబిరంలో దాదాపు 300 మంది ఔత్సాహిక విద్యార్థులు రక్తాన్ని దానం చేశారు . ఇలాంటి మరిన్ని శిబిరాలను ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉందని , పెద్దసంఖ్యలో విద్యార్థులు ముందుకొచ్చి ఈ రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాలని ప్రోవీసీ ప్రొఫెసర్ డీఎస్ రావు పిలుపు నిచ్చారు .
ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న రెడ్ క్రాస్ సొసెట్రీ డాక్టర్ జనార్దనరెడ్డి , ఇతర సిబ్బంది , నిర్వహిస్తున్న చరెవేతి విద్యార్థి విభాగాన్ని ఆయన అభినందించారు . ఈ కార్యక్రమాలలో గీతం రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ , స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అసోసియేట్ డెరైక్టర్ ప్రొఫెసర్ ఎన్.సీతారామయ్య , ప్రొఫెసర్ కె . మంజునాథాచారి , పలు విభాగాధిపతులు , అధ్యాపకులు , విద్యార్థులు పాల్గొన్నారు
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…
చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…
రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…
పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…
నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…