– ముఖ్య అతిథిగా ఐఎస్ఓ వ్యవస్థాపక డీన్, గౌరవ డాక్టరేట్ అందుకోనున్న గోరటి వెంకన్న
పటాన్‌చెరు,,మనవార్తలు ప్రతినిధి :
గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం 14వ పట్టాల ప్రదానోత్సవం (స్నాతకోత్సవం) జూన్ 3, 2023న (శనివారం) హెదరాబాద్ మధ్యాహ్నం 2.30 గంటలకు నిర్వహించనున్నట్టు గీతం హెదరాబాద్ ప్రో వెస్ట్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ డీ.ఎస్.రావు వెల్లడించారు.గీతం హెదరాబాద్ ప్రాంగణంలో ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, సెన్ట్స్, ఫార్మసీ, హ్యుమానిటీస్, అర్కిటెక్చర్ కోర్సులను 2022-23 విద్యా సంవత్సరం నాటికి పూర్తిచేసిన విద్యార్థులు, డిగ్రీలు, డిప్లొమోలు పొందడానికి అర్హులన్నారు.గీతం కులపతి డాక్టర్ నరందర్ సింగ్ చౌహాన్ అధ్యక్షతన జరిగే ఈ కార్యక్రమంలో గీతం అధ్యక్షుడు ఎం.శ్రీభరత్లో పాటు ముఖ్య అతిథిగా ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్ఓ) వ్యవస్థాపక డీన్ ప్రొఫెసర్ ప్రమత్ రాజ్ సిన్హా ముఖ్య అతిథిగా పాల్గొంటారని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ కవి, గాయకుడు, తెలంగాణ ఎమ్మెల్సీ గోరటి వెంకన్నకు గౌరవ డాక్టరేట్ను ప్రధానం చేస్తామన్నారు.ఇతర వివరాల కోసం గీతం వెబ్సైట్ www.gitam.edu ను సందర్శించాలని ప్రోవీసీ సూచించారు.