Telangana

టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇంపాక్ట్ ర్యాంకింగ్స్-2025లో ప్రపంచ గుర్తింపు సాధించిన గీతం

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

యునైటెడ్ కింగ్డమ్ ఆధారిత ర్యాంకింగ్ ఏజెన్సీ ప్రచురించిన ప్రతిష్టాత్మక టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ (THE) ఇంపాక్ట్ ర్యాంకింగ్స్-2025లో గీతం గణనీయమైన ప్రపంచ గుర్తింపును పొందిందని డైరెక్టరేట్ ఆఫ్ అక్రిడిటేషన్, ర్యాంకింగ్ & IQAC గర్వంగా ప్రకటించింది. ఆ విభాగం డైరెక్టర్ ప్రొఫెసర్ ఆర్.రాజా ప్రభు శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఈ వివరాలను వెల్లడించారు.ఒక ప్రధాన మైలురాయిగా చెప్పుకోదగ్గ, ఐక్యరాజ్య సమితి 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాల (SDGs)లో గీతం ర్యాంకు పొందినట్టు తెలియజేశారు. ప్రపంచవ్యాప్తంగా అతి కొద్ది విశ్వవిద్యాలయాలు మాత్రమే ఈ ప్రత్యేకతను సాధించనట్టు తెలిపారు. స్థిరత్వం, విద్యా నైపుణ్యం, సామాజిక ప్రభావం పట్ల గీతం యొక్క దృఢమైన నిబద్ధతను ఈ విజయం నొక్కి చెబుతోందన్నారు.ఏడు సుస్థిరాభివృద్ధి లక్ష్యాల (SDGs) సాధనలో, వంద ఉత్తమ ప్రపంచ విశ్వవిద్యాలయాలలో ఒకటిగా గీతం గుర్తింపు పొందడం ఈ ఏడాది ర్యాంకింగ్స్ లో ఒక విశిష్ట విజయంగా పేర్కొన్నారు. సరసమైన, స్వచ్ఛమైన శక్తి (Affordable and Clean Energy) విభాగంలో గీతం 81వ ర్యాంకు సాధించిందని, ఇది సంస్థ ప్రయాణంలో తొలి, అద్భుతమైన ఘనతగా అభివర్ణించారు.గత నాలుగేళ్లుగా ఈ ర్యాంకింగులలో గీతం స్థిరమైన పురోగతిని ప్రదర్శిస్తోందని, 2022లో నాలుగు సుస్థిరాభివృద్ధి లక్ష్యాల (SDGs) విభాగాలలో, 2023లో ఎనిమిది, 2024లో 12, ఈ ఏడాది 17 విభాగాలలో గీతం క్రమాభివృద్ధిని ప్రదర్శించినట్టు డాక్టర్ రాజా ప్రభు వివరించారు.విద్యావేత్తలు, పరిశోధన, సమాజంతో మమేకం కావడంలో స్థిరత్వాన్ని, గీతం యొక్క వ్యూహాత్మక ఏకీకరణను ఈ ఎదుగుదల ప్రతిబింబిస్తోందన్నారు. ఆవిష్కరణ, సామాజిక ఔచిత్యం, నిరంతర అభివృద్ధి ద్వారా అర్థవంతమైన మార్పు వైపు సంస్థను నడిపించడంలో గీతం నాయకత్వం, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థుల సమిష్టి ప్రయత్నాలకు ఈ గుర్తింపు నిదర్శమని చెప్పారు.ఈ మైలురాయిని చేరుకోవడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ డాక్టర్ రాజా ప్రభు హృదయపూర్వక కృతజ్జతలు తెలియజేశారు. ప్రపంచ ప్రమాణాలను అందుకోవడానికి గీతం కట్టుబడి ఉందని, అన్ని వేదికలలో ఈ గర్వించదగ్గ క్షణాలను పంచుకోవడాన్ని కొనసాగిస్తుందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

admin

Recent Posts

ప్రతి అధికారి క్షేత్రస్థాయిలో పర్యటించండి

విద్యుత్, మంచినీరు, పరిశుభ్రత అంశాలకు ప్రథమ ప్రాధాన్యత బల్దియా పరిధిలోని ప్రతి ఇంటికి స్వచ్ఛ జలాలు ప్రతి కాలనీలో పచ్చదనం…

11 hours ago

అంతర్జాతీయ సదస్సులో గీతం అధ్యాపకుడికి ఉత్తమ పత్ర అవార్డు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం అధ్యాపకుల కృషి మరోసారి విద్యారంగ నిపుణుల ప్రశంసలను అందుకుంది. హైదరాబాదులోని గీతం స్కూల్…

11 hours ago

గీతంలో వందేమాతరం 150వ వార్షికోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో బుధవారం వందేమాతరం 150వ వార్షికోత్సవాన్ని స్ఫూర్తిదాయకంగా జరుపుకున్నారు. వందేమాతరం…

11 hours ago

సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర మరింత పెరగాలి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి ,అమీన్పూర్ : సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర అభినందనీయమని రాబోయే రోజుల్లో వారి పాత్ర మరింత…

23 hours ago

మీ ఆలోచనే మీకు పెట్టుబడి

గీతంలో నిర్వహించిన ముఖాముఖిలో వజ్ర ఆటోమేషన్ పూర్వ సీఈవో వెల్లడి మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఒక మంచి ఆవిష్కరణ…

1 day ago

జిన్నారం సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డు సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్‌చెరు…

2 days ago