మనవార్తలు ,పటాన్ చెరు:
పాడెపోయిన ఫొటోలను పునరుద్ధరించడానికి వివిధ రకాల అభ్యాస పద్ధతులు అనే అంశంపై సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించిన హెదరాబాద్ , గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని ఎలక్ట్రికల్ , ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ కె.ప్రవీణ్ కుమారు డాక్టరేట్ వరించింది . లార్డ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సి.వెంకట నరసింహులు , జేఎన్టీయూ కాకినాడ పూర్వ ప్రొఫెసర్ డాక్టర్ కె.శివప్రసాద్ లు ఈ పరిశోధనను పర్యవేక్షించినట్టు మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించారు . ఈ పరిశోధనలో , క్షీణించిన చిత్రాలను సమర్థవంతంగా పునరుద్ధరించడానికి వివిధ రకాల వేవెట్లు , లోతెన అభ్యాస పద్ధతులతో వివిధ అల్గారిథమ్లు అమలు చేసినట్టు తెలియజేశారు . తద్వారా అనుమానిత వ్యక్తిని కనుగొనడం , రోగి ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడానికి ఉపకరిస్తుందన్నారు . ఈ పరిశోధనలో భాగంగా 14 పరిశోధనా పత్రాలను ప్రచురించినట్టు తెలిపారు . ప్రవీణ్ కుమార్ సమర్పించిన సిద్ధాంత వ్యాసం కాకినాడలోని ప్రతిష్ఠాత్మక జేఎన్టీయూ విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్డీ పట్టా సాధించడం పట్ల గీతం విశ్వవిద్యాలయం , హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీఎస్ రావు , రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ , స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అసోసియేట్ డెరైక్టర్ ప్రొఫెసర్ ఎన్.సీతారామయ్య , ఈఈసీఈ విభాగాధిపతి ప్రొఫెసర్ టి.మాధవి , పలు విభాగాల అధిపతులు , అధ్యాపకులు , సిబ్బంది పలువురు అభినందించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…