politics

గీతమ్ ప్రమాణ సెక్రటేరియట్ ప్రారంభం…

మనవార్తలు ,పటాన్ చెరు:

గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం , హైదరాబాద్ లో ప్రమాణ -2 కే 23 సచివాలయాలన్ని గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అసోసియేట్ డెరైక్టర్ ప్రొఫెసర్ ఎన్.సీతారామయ్య , స్కూల్ ఆఫ్ బిజినెస్ ప్రొఫెసర్ కరుణాకర్.బి . , స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ప్రొఫెసర్ సునీలక్కుమార్లు శుక్రవారం సంయుక్తంగా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు . గీతమ్లో ప్రతియేటా మూడు రోజుల పాటు సాంకేతిక – సాహిత్య – నిర్వహణల మేలు కలయికగా నిర్వహించే మూడు రోజుల పండుగకు సన్నాహకంగా ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు . సాంకేతిక శిక్షణ , ఉపన్యాసాలు , పోటీలతో పాటు ర్యాంప్ వాక్ , సింఫోనీ , కన్సర్ట్ , బ్యాటిల్ ఆఫ్ బ్యాండ్స్ , కార్నివాల్ , పలు యాజమాన్య మెళకువలను నేర్పే పోటీల సమాహారంగా ఈ కార్యక్రమం కొనసాగుతుంది . ప్రమాణ కార్యాలయాన్ని ఆరంభించిన సందర్భంగా ప్రొఫెసర్ సీతారామయ్య మాట్లాడుతూ , నూతన సాంకేతికత మేళవింపుతో కార్యక్రమాలను ఎంపికచేసి , ఇతర కళాశాలల విద్యార్థులు విరివిగా పాల్గొనేలా వాటిని రూపొందించమని సూచించారు .

విశ్వస్థాయి ప్రమాణాలతో గీతం ప్రమాణ 2023 ని నిర్వహించాలని , జంట నగరాల చుట్టుపక్కల విద్యార్థులనే కాకుండా విశ్వవ్యాప్తంగా లేదా దేశ నలుమూలల ఉన్న సాంకేతిక కళాశాలల విద్యార్థులు పాల్గొనేలా చూడాలని ప్రొఫెసర్ కరుణాకర్ ఉద్బోధించారు . ప్రమాణ ద్వారా యాజమాన్య మెళకువలను నేర్చుకోవచ్చన్నారు . గత ఉత్సవాల కంటే ఈ ఏడాది ప్రమాణ -2 కే 23 మేటిగా ఉండేలా తీర్చిదిద్దమని ప్రమాణ నిర్వాహకులు డాక్టర్ పి.త్రినాథరావు , డాక్టర్ రూపాలత , స్టూడెంట్ లెఫ్ట్ సీనియర్ మేనేజర్ సమీర్ ఖాన్లు సూచించారు . వివిధ విభాగాధిపతులు , పలువురు అధ్యాపకులు , విద్యార్థులు ప్రమాణ -2323 కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు . గీతం వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ ఎంవీవీఎస్ మూర్తికి ఈ సందర్భంగా నివాళులర్పించారు .

admin

Recent Posts

సమాజానికే సందేశం గాంధీజీ జీవన విధానం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…

7 days ago

మాతృభూమిపై మమకారాన్ని చాటే అపూర్వ అవకాశం వికసిత్ భారత్ రన్‌

మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…

2 weeks ago

కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు కొనసాగిస్తాం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…

2 weeks ago

గొప్ప గాంధేయవాది కొండా లక్ష్మణ్ బాపూజీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…

3 weeks ago

పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేవి సైన్స్ ఎగ్జిబిషన్ లు

- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…

3 weeks ago

వికలాంగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…

3 weeks ago